నోటా ఇమ్మిటేష‌న్ కేటీఆర్‌ ని చూసే!

Update: 2018-10-04 10:33 GMT
విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన నోటా ఎలాంటి అవాంత‌రాలు లేకుండా ఈనెల 5న రిలీజ‌వుతోంది. ఆ సంగ‌తిని చిత్ర క‌థానాయ‌కుడు స్వ‌యంగా మీడియాకి ప్ర‌క‌టించారు. ఇటీవ‌ల కోర్టు వివాదాల నేపథ్యంలో  ఈ సినిమా రిలీజ‌వుతుందా? అవ్వ‌దా? అన్న సందిగ్ధ‌త నెల‌కొంది. ఒక‌రోజు ఆలస్యంగా  అంటే అక్టోబ‌ర్ 6న రిలీజ‌వుతుంద‌ని ప్ర‌చారం సాగింది. అయితే వాట‌న్నిటికీ విజ‌య్ దేవ‌ర‌కొండ స్వ‌యంగా ఆన్స‌ర్ చేశారు. అక్టోబ‌ర్ 5న ప్ర‌పంచ‌వ్యాప్తంగా నోటా రిలీజవుతోంద‌ని హైద‌రాబాద్ ప్ర‌సాద్ లాబ్స్‌ లో జ‌రిగిన ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు.

నోటాలో యంగెస్ట్ సీఎంని చూస్తారు. ఇంత‌వ‌ర‌కూ తెలుగు ప్రేక్ష‌కులు మునుపెన్న‌డూ ఇంత యంగ్ సీఎంని చూసి ఉండ‌రు. ఈ సినిమాలో రాజ‌కీయ నేపథ్యం ఉన్నా పూర్తిగా రాజ‌కీయాలే కాదు - అన్ని అంశాలు ఉంటాయ‌ని తెలిపారు. సీఎం గా న‌టిస్తున్నారు క‌దా?  ఎవ‌రినైనా రాజ‌కీయ నాయ‌కుడిని అనుస‌రించారా? అన్న ప్ర‌శ్న‌కు .. అవును అనుస‌రించాన‌నే తెలిపారు. స్టైలింగ్ స‌హా ప్ర‌తిదీ యంగ్ మినిస్ట‌ర్ కేటీఆర్ ని అనుస‌రించాన‌ని తెలిపారు. ఆయ‌న ఫోటోల్ని - వ్య‌వ‌హారిక శైలిని ప‌రిశీలించాన‌ని వెల్ల‌డించారు. ఖాదీ వ‌స్త్రధార‌ణ విష‌యంలోనూ ఆయ‌నే స్ఫూర్తి అని అన్నారు.

నోటా త‌ర్వాత ఏ సినిమాల్లో న‌టిస్తున్నారు? అన్న ప్ర‌శ్న‌కు క్రాంతి దర్శకత్వం లో ఓ సినిమా ఉంది. ఓ ద్విభాషా చిత్రం గురించి ఆలోచిస్తున్నాన‌న‌ని తెలిపారు. ప్ర‌స్తుతం నోటా ప్ర‌చారంలో బిజీగా ఉన్నాన‌ని, తీరిక లేని షెడ్యూల్స్ తో ఉర‌క‌లెత్తుతున్నాన‌ని వెల్ల‌డించారు.  నేను గత ఎన్నికల్లో టీఆర్ ఎస్ పార్టీకి ఓటేశాను. ఇపుడు కూడా అదే పార్టీకి వేస్తాను.



Tags:    

Similar News