సూపర్ కూల్ కార్ లో విజయ్ దేవరకొండ జాలీ రైడ్..!

Update: 2021-12-19 04:00 GMT
టాలీవుడ్ లో సినీ బ్యాగ్రౌండ్ లేకుండా స్వయంకృషితో ఎదిగిన టాలెంటెడ్ హీరోలలో విజయ్ దేవరకొండ ఒకరు. కెరీర్ ప్రారంభంలో చిన్న పాత్రల్లో మెప్పించి.. ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ స్టేటస్ అందుకున్నారు. ఇంతింతై వటుడింతై అన్న చందంగా అతడి స్థాయి అసమానంగా పెరిగింది.

యూత్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకున్న వీడీ.. దాన్ని నిలబెట్టుకునే దిశగా కథలను ఎంపిక చేసుకుంటూ వస్తున్నారు. సినిమా సినిమాకు క్రేజ్ పెంచుకుంటూ పోతున్న విజయ్.. ఇప్పుడు 'లైగర్' చిత్రంతో పాన్ ఇండియా పాపులారిటీ తెచ్చుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.

ఓ చిన్న షెడ్యూల్ మినహా 'లైగర్' షూటింగ్ మొత్తం పూర్తి చేసిన విజయ్ దేవరకొండ.. ప్రస్తుతం దొరికిన సమయాన్ని తన ఫ్యామిలీతో గడుపుతున్నారు. ఈ మధ్య అంతా సినిమా షూటింగ్ లతో బిజీగా గడిపి.. ఇప్పుడు తనకెంతో ఇష్టమైన కార్లలో సిటీ అంతా విహరిస్తున్నారు.

విజయ్ శనివారం హైదరాబాద్ రోడ్ల మీద తన సూపర్ కూల్ కారులో జాలీగా తిరుగుతూ కెమెరాల కళ్ళకు చిక్కారు. నగర శివార్లలో వీడీ బ్యూటిఫుల్ రైడ్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. VD వద్ద ప్రస్తుతం రోల్స్ రాయిస్ డాన్ లగ్జరీ కార్ తో పాటుగా BMW 5 సిరీస్ సెడాన్ - ఫోర్డ్ ముస్తాంగ్ జీటీ - మెర్సిడెస్ బెంజ్ జిఎల్సి వంటి ఖరీదైన కార్లు ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా, 'పెళ్లి చూపులు' విజయ్ దేవరకొండ.. 'అర్జున్ రెడ్డి' చిత్రంతో సంచలన విజయం సాధించారు. 'గీత గోవిందం' బ్లాక్ బస్టర్ అవడంతో సెన్సేషనల్ స్టార్ రేంజ్ అమాంతం పెరిగింది. 'అర్జున్ రెడ్డి' హిందీ రీమేక్ వల్ల బాలీవుడ్ జనాలు కూడా దేవరకొండ వైపు చూపు తిప్పి.. మన రౌడీ గురించి ఆరాలు తీసారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ - పూరీ జగన్నాథ్ లతో కలిసి పాన్ ఇండియా మూవీ ''లైగర్'' చేస్తున్నారు విజయ్.

మిక్డ్స్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ కథాంశంతో తెరకెక్కుతున్న 'లైగర్' సినిమాలో ప్రొఫెషనల్ బాక్సర్ గా కనిపించడానికి చాలా హార్డ్ వర్క్ చేశారు. ఇది యువ హీరోకి ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. తెలుగుతో పాటు హిందీ తమిళ మలయాళ కన్నడ భాషల్లో రానుంది. 'అర్జున్ రెడ్డి' వంటి బ్లాక్ బస్టర్ రిలీజ్ డేట్ ఆగస్ట్ 25న (25.08.2022) విడుదల కాబోతోంది.

ఇక స్టైల్ ఐకాన్ గా భావించే విజయ్ దేవరకొండ.. ఫ్యాషన్ అండ్ స్టైలింగ్ కి సంబంధించిన బిజినెస్ లో అడుగుపెట్టారు. 'రౌడీ క్లబ్' అనే బ్రాండ్ తో ఆకర్షణీయమైన వస్త్రాలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అలానే సొంతంగా నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి.. యంగ్ టాలెంట్ ని ప్రోత్సహిస్తున్నారు.

Full View




Tags:    

Similar News