అర్జున్ రెడ్డి’ తర్వాత విజయ్ దేవరకొండ నటించిన ‘మహానటి’ చిత్రం బుధవారమే ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ చిత్రంలో అతను విజయ్ ఆంటోనీ అనే వ్యక్తి పాత్రలో నటించాడు. సావిత్రి జీవితంపై పరిశోధన చేసే మధురవాణి అనే జర్నలిస్టుకు సాయపడే వ్యక్తి అతను. మధురవాణిగా సమంత నటించిన సంగతి తెలిసిందే. సినిమాలో తనది చిన్న పాత్రే అంటున్నాడు విజయ్. నిజానికి ముందు తనకు దుల్కర్ సల్మాన్ చేసిన జెమిని గణేశన్ పాత్ర ఆఫర్ చేశారని.. కానీ తాను చేయగలనా అన్న సందేహంలో పడ్డానని.. ఏం చేద్దామా అనుకుంటున్న సమయంలోనే దుల్కర్ సల్మాన్ డేట్లు సర్దుబాటు కావడంతో అతడితోనే ఆ పాత్ర చేయించాలని ఫిక్సయ్యారని.. తాను ఊపిరి పీల్చుకున్నానని విజయ్ చెప్పాడు.
తనను ‘మహానటి’ సినిమా కోసం నిర్మాతల్లో ఒకరైన స్వప్న దత్ అడిగినపుడు జరిగిన సరదా సంభాషణ గురించి అతను వెల్లడించాడు. ‘‘ఓ రోజు స్వప్న నాకు ఫోన్ చేసి ‘మహానటి’ గురించి చెప్పారు. నేను ఆమెను అక్క అని పిలుస్తుంటా. ‘అక్కా.. నేను మంచి నటుడినని తెలుసు కదా.. ఈసారి సావిత్రి పాత్రను ప్రయత్నిస్తా. అవకాశం ఇవ్వు’ అన్నాను. దీంతో ఆమె గట్టిగా నవ్వి.. షటప్ అంది. ఈ సినిమాలో నువ్వు చిన్న పాత్ర చేయాలని అడిగింది. ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమా నుంచి నాగ్ అశ్విన్, స్వప్న దత్, ప్రియాంక దత్ బాగా తెలుసు. అదే బృందం కలిసి చేస్తున్న సినిమా కావడం.. ఇలాంటి సినిమాలు మళ్లీ మళ్లీ రావు అనిపించడంతో ఇందులో నటించేందుకు ఒప్పుకున్నా’’ అని విజయ్ చెప్పాడు. నిజానికి ‘మహానటి’ తన సినిమా కాదని.. అది సావిత్రి సినిమా అని.. మంచి కథ కావడంతో చిన్న పాత్ర చేశానంతే అని.. ‘టాక్సీవాలా’లో జనాలకు అసలు విజయ్ దేవరకొండ కనిపిస్తాడని అతనన్నాడు.