సినీ రంగంలోకి వచ్చే యువ కథానాయకులందరికీ మెగాస్టార్ చిరంజీవిని ఆదర్శం. ఏ బ్యాగ్రౌండ్ లేకుండా పరిశ్రమలోకి అడుగుపెట్టి.. ఎన్నో ఇబ్బందుల్ని తట్టుకుని.. ఎంతో కష్టపడి హీరోగా నిలదొక్కుకుని.. ఆ తర్వాత అగ్ర పథానికి దూసుకెళ్లిన నటుడు చిరు. ఆయన్ని కలవడాన్నే గొప్ప ఘనతగా భావిస్తారు కొత్త హీరోలు. అలాంటిది ఆయన నుంచి ప్రశంసలు అందుకోవడం అంటే మాటలు కాదు. ఈ విషయంలో విజయ్ దేవరకొండ సైతం చాలా ఉద్వేగానికి గురవుతున్నాడు. ‘గీత గోవిందం’ సినిమా చూశాక చిరు చెప్పిన మాటలు.. అందించిన ప్రశంసల్ని తాను ఎప్పటికీ మరిచిపోలేనని అతనంటున్నాడు. ఇటీవలే ‘గీత గోవిందం’ సినిమాను ప్రసాద్ ల్యాబ్స్ లో చిరు ప్రత్యేకంగా వీక్షించిన సంగతి తెలిసిందే. అనంతరం చిరు తనతో ఏమన్నది విజయ్ వివరించాడు.
సినిమా చూసిన వెంటనే తన దగ్గరికి వచ్చి తన డైలాగులు.. తన టైమింగ్.. ఇంకా మరిన్ని విషయాల గురించి చిరు విడమరిచి చెబుతుంటే తనకు నమ్మశక్యంగా అనిపించలేదని విజయ్ చెప్పాడు. ‘చిరు నా సినిమా చూడటమేంటి.. దాని గురించి మాట్లాడటమేంటి’ అనే షాక్ లో తాను ఉండిపోయానని అతనన్నాడు. చిరంజీవి కథానాయకుడిగా ఎదిగిన తీరు.. అందుకోసం పడ్డ కష్టం గురించి తన తండ్రి ఎప్పుడూ చెబుతూ ఉండేవారని.. ఆ రకంగా ఆయన తనకు స్ఫూర్తిగా నిలిచారని.. అలాంటి వ్యక్తితో తనతో ఇలా మాట్లాడటం చాలా గొప్పగా అనిపించిందని విజయ్ చెప్పాడు. చరణ్ కు ఎలాంటి సలహాలిచ్చారో అలాగే తనకూ చెప్పారని.. ఎలాంటి కథల్ని ఎంచుకోవాలో.. మన ప్రవర్తన ఎలా ఉండాలో వివరంగా చెప్పారని.. ఆ మాటల్ని తన జీవితాంతం గుర్తు పెట్టుకుంటానని విజయ్ తెలిపాడు.