బెజ‌వాడ రౌడీయిజం మ‌రిచాడే!

Update: 2018-10-01 04:06 GMT
సంచ‌ల‌నాల దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం `నోటా` ప్ర‌మోష‌న్స్‌ లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. నిన్న మొన్న‌టి వ‌ర‌కూ `నోటా` త‌మిళ ప్ర‌మోష‌న్స్‌ లో బిజీగా ఉన్నాడు. ఇక‌పై తెలుగులో ప్ర‌మోష‌న‌ల్ హీట్ పెంచేస్తున్నాడు. నిన్న‌టి సాయంత్రం బెజ‌వాడ బెంజి స‌ర్కిల్స్‌ ని నోటా బృందం ఒణికించింది. అయితే అక్క‌డ చాలా చిన్న స్టేడియం కావ‌డంతో భారీగా త‌ర‌లివ‌చ్చిన అభిమానుల తాకిడికి కొంత ఇబ్బంది ఎదురైంద‌ని తెలుస్తోంది. ఆ క్ర‌మంలోనే దేవ‌ర‌కొండ త‌న అభిమానుల‌కు సారీ చెప్పాడు. బయట ఉన్నవాళ్ళని చూడలేకపోతున్నాను. ``సారీ! నెక్స్ట్ టైం ఇంకా పెద్ద హాల్ లో ఏర్పాటు చేస్తాను. ఇంత చిన్న హాల్ సరిపోదు.. క్షమాపణ చెప్తున్నాను.. అందరు జాగ్రత్తగా వెళ్ళండి`` అని  దేవ‌ర‌కొండ అభిమానుల‌కు క్ష‌మాప‌ణ చెప్పారు.

అదొక్క‌టే కాదు.. నోటా గురించి మాట్లాడుతూ దేవ‌ర‌కొండ బెజ‌వాడ సెంటిమెంటును ర‌గిల్చాడు. దేవరకొండ మాట్లాడుతూ-``విజయవాడ కి చాలా రోజుల తర్వాత వచ్చాను. ఎవడే సుబ్రహ్మణ్యం  తర్వాత మ‌ళ్లీ ఇదే. రెండు తెలుగు రాష్ట్రాల్లో అందునా విజయవాడలో అందరికీ న‌చ్చేది.. ఇష్టమైనది.. సినిమా.. రాజకీయం. ఆ రెండిటినీ కలిపి వస్తున్న పవర్ ఫుల్ జబర్దస్త్ సినిమా నోటా. ఈ సినిమా ద్వారా మీ అందరికి మంచి వినోదాన్ని అందిస్తా`` అని అన్నారు.

నోటా అక్టోబర్ 5 న రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. అంటే ఇంకా నాలుగే రోజులు ఉంది. థియేటర్ లో కలుద్దామ‌ని దేవ‌ర‌కొండ అభిమానుల‌తో అన్నారు. మంచి స్క్రిప్ట్ తో - పవర్ ఫుల్ డైలాగ్స్ తో వస్తున్న సినిమా ఇద‌ని తెలిపారు. మొత్తానికి దేవ‌ర‌కొండ త‌న మాట‌ల‌తో మ‌రోసారి ఇంప్రెస్‌ చేశాడు. బెజ‌వాడ సెంటిమెంటును ర‌గిల్చాడు తెలివిగా. అయితే బెజ‌వాడ రౌడీయిజం గురించి మాత్రం దేవ‌ర‌కొండ అస్స‌లు ట‌చ్ చేయ‌లేదు. బ‌హుశా ఆ పాయింట్ ఏమైనా మ‌ర్చిపోయాడో ఏమో!!? ఇక ఇదే వేదిక‌పై మెహ్రీన్ మాట్లాడుతూ దేవ‌ర‌కొండ లాంటి వేరొక హీరోని ఇంత‌వ‌ర‌కూ చూడ‌లేద‌ని పొగిడేయ‌డం అభిమానుల్లో చ‌ర్చ‌కొచ్చింది. ఈ ఈవెంట్‌కి హైద‌రాబాద్‌ - తెలంగాణ నుంచి దేవ‌ర‌కొండ ఫ్యాన్స్ భారీగా త‌ర‌లి వెళ్లార‌ని తెలుస్తోంది.
Tags:    

Similar News