టాప్ స్టోరి: ఫేట్ అంటే ఇదే సామీ!

Update: 2019-06-22 01:30 GMT
ప‌రిశ్ర‌మ‌లో ఫేట్ - ల‌క్ ఫ్యాక్ట‌ర్ గురించి ఎక్కువగా మాట్లాడుతుంటారు. ఒకేసారి కెరీర్ ప్రారంభించిన హీరోలు లేదా కోస్టార్లు కొన్నాళ్ల త‌ర్వాత భిన్న మార్గాల్లో వెళ్ల‌డం చూస్తుంటాం. ఒక‌రు పెద్ద స్టార్ అయిపోతే ఇంకొక‌రు విల‌న్ గానో క్యారెక్ట‌ర్ ఆర్టిస్టు నో అయిన సంద‌ర్భాలుంటాయి. మ‌రికొంద‌రు తాము చూస్తుండ‌గానే  సాటి న‌టుడు పెద్ద స్టార్ అయిపోవ‌డం చూసి షాక్ తిన్నామ‌ని చెబుతుంటారు.

ఇదిగో ఇక్క‌డ ఇద్ద‌రు హీరోల జాత‌కం ప‌రిశీలిస్తే ఇంచుమించు అలానే ఉంది. దాదాపు ఒకేసారి ఆడిష‌న్స్ ప్రారంభించిన ఆ ఇద్ద‌రిలో ఒక‌రు జెట్ స్పీడ్ తో టేకాఫ్ అయితే.. ఇంకొక‌రు మాత్రం ఇపుడిపుడే హీరోగా తొలి స్టెప్ వేయ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ఇంత‌కీ ఎవ‌రి గురించి? అంటే .. సెన్సేష‌న‌ల్ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ఏజెంట్ ఆత్రేయ ఫేం న‌వీన్ పోలిశెట్టి గురించే. ఏజెంట్ సాయి శ్రీ‌నివాస ఆత్రేయ చిత్రం నేడు రిలీజై న‌వీన్ కి మంచి పేరు తెచ్చింది. న‌టుడిగా అత‌డి ప్ర‌తిభ‌కు మంచి మార్కులే వేశారు.

అయితే అత‌డి కెరీర్ ఆరంభ‌మైంది దేవ‌ర‌కొండ‌తో స‌మానంగానే. అదే విష‌యాన్ని న‌వీన్ పోలిశెట్టి ఓ ఇంట‌ర్వ్యూలో స్వ‌యంగా వెల్ల‌డించారు. న‌వీన్ మాట్లాడుతూ..``నేను థియేటర్ ఆర్టిస్టుగా ఉన్నప్పుడు ఒకసారి వర్క్ షాప్ లో విజయ్ దేవరకొండను కలుసుకున్నా. మేం కలిసి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాకి ఆడిషన్స్  కి వెళ్లాం. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ కోసం ఆడిషన్స్ కి వెళ్తే మమ్మల్ని అపోజిట్ గ్యాంగ్ లో వేశారు`` అంటూ కెరీర్ తొలి నాళ్ల అనుభ‌వాన్ని వెల్ల‌డించారు. క‌ట్ చేస్తే ప్ర‌స్తుత సీన్ ఏంటో తెలిసిందే. విజ‌య్ దేవ‌ర‌కొండ టాలీవుడ్ లో వ‌రుస బ్లాక్ బ‌స్ట‌ర్ల‌తో సెన్సేష‌న‌ల్ స్టార్ గా వెలిగిపోతున్నాడు. న‌వీన్ పోలిశెట్టి ఇంకా వ‌న్ ఫిలిం కిడ్ గానే ఉన్నారు. ఇక త‌మ గ‌త స్నేహాన్ని దృష్టిలో పెట్టుకుని దేవ‌ర‌కొండ స్వ‌యంగా ఏజెంట్ సాయి శ్రీ‌నివాస్ ఆత్రేయ‌ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ - ట్రైలర్ ని విజయ్ రీట్వీట్ చేశారు. అది త‌మ సినిమాకి హైప్ క్రియేట్ చేసింద‌ని దేవ‌ర‌కొండ‌కు న‌వీన్ ధన్యవాదాలు తెలిపారు. ఏజెంట్ గా డిటెక్టివ్ సినిమాతో మొద‌లై న‌టుడిగా ఫ‌ర్వాలేద‌నిపించిన న‌వీన్ పోలిశెట్టి త‌దుప‌రి బాలీవుడ్ లోనూ అడుగుపెడుతున్నాడు. హిందీ లో దంగల్ లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన నితేష్ తివారి దర్శకత్వంలో `చిచోరి` అనే భారీ చిత్రంలో న‌టిస్తున్నాడు. తెలుగులో రెండు మూడు క‌థ‌లు విన్నాడ‌ట‌.

క‌మ్ముల హ్యాపీ డేస్ చిత్రంతో హీరోలుగా కెరీర్ ప్రారంభించిన న‌లుగురు బోయ్స్ క‌థ ఇంచుమించు ఇలానే ఉంది. అయితే ఆ న‌లుగురిలో ఎంతో పెద్ద స్టార్ గా ఎదిగిన వ‌రుణ్ సందేశ్ కెరీర్ ఊహించ‌ని విధంగా కిందికి దిగ‌జారింది. అదే స‌మ‌యంలో నెమ్మ‌దిగా ఒక్కో అడుగు ముందుకు వేస్తూ టాలీవుడ్ లోనే మోస్ట్ ప్రామిస్సింగ్ హీరోగా త‌న‌ని తాను నిల‌బెట్టుకోవ‌డంలో  నిఖిల్ పెద్ద స‌క్సెస‌య్యారు. ఇత‌ర ఇద్ద‌రు హీరోలు ప్ర‌స్తుతం కెరీర్ ప‌రంగా జీరోల‌య్యారు. ఫేట్ - ల‌క్ ఫ్యాక్ట‌ర్ అంటే ఇదేనేమో!


Tags:    

Similar News