`అర్జున్ రెడ్డి` సినిమాతో టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ క్రేజ్ పీక్స్ కి చేరింది. ఆ తరువాత వచ్చిన ఒకటి అర సినిమాలు ఫ్లాప్ అయినా `గీత గోవిందం` చేసిన మ్యాజిక్ తో వంద కోట్ల క్లబ్ హీరోగా వెలిగిపోతున్నాడు. ఇటీవల చేసిన `నోటా` ఆశించిన విజయాన్ని అందించలేక నిరాశపరిచినా విజయ్ క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. బాక్సాఫీస్ వద్ద ఓపెనింగుల జోరు కొనసాగిస్తున్నాడు. దేవరకొండ నుంచి మరో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అతడు నటించిన తాజా చిత్రం `టాక్సీవాలా` గత కొన్ని నెలలుగా వాయిదాల ఫర్వంలో వెనకబడినా ఎట్టకేలకు ఇప్పటికి విడుదలవుతోంది. ఈ నెల 17న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.
మీడియా నుంచి వచ్చి నిర్మాతగా మారిన ఎస్ కెఎన్ - యువీ క్రియేషన్స్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ ని మొదలుపెట్టిన విజయ్ దేవరకొండ ఇదొక మినీ బాహుబలి అంటూ దీపావళి ఇంటర్వ్యూల్లో హైలైట్ చేస్తున్నాడు. `బాహుబలి` చిత్రానికి 2700 గ్రాఫిక్స్ షాట్స్ వుంటే మా సినిమాకు 640 షాట్స్ వున్నాయని పెద్ద లెక్కే చెప్పేశాడు. దాని వల్లే సినిమా ఆలస్యమైందని వివరించాడు.
ఓ చిట్ చాట్ లో దేవరకొండ మాట్లాడుతూ-``నాకు హారర్ సినిమాలంటే చచ్చేంత భయం. రాహుల్ కథ చెప్పగానే నటించనని ముఖం ముందే చెప్పేశాను. అయితే తరువాత తను నన్ను కన్విన్స్ చేసిన తీరు నచ్చి అంగీకరించాను. `పెళ్లిచూపులు`తో ప్రియదర్శిని - `అర్జన్ రెడ్డి`తో రాహుల్ రామకృష్ణను పరిచయం చేసిన నేను ఈ సినిమాతో హాలీవుడ్ ను పరిచయం చేస్తున్నాను. హాలీవుడ్ అంటే హాలీవుడ్ కాదు వాడు చిన్నపిల్లాడు. ఈ సినిమాతో వాడికి మంచి పేరొస్తుంది`` అంటూ చెప్పుకొచ్చాడు. ఆన్ లైన్ లో మెజారిటీ పార్ట్ సినిమా లీకైపోయిందని ఇదివరకూ నోటా ప్రమోషన్స్ లో చెప్పిన దేవరకొండ `ట్యాక్సీవాలా`ను గట్టెక్కించడమెలా అన్న ప్రణాళికల్లో ఉన్నాడు. అందుకే ప్రచారంలో ఊదరగొట్టేస్తున్నాడు. ప్రచారానికి పనికొచ్చే ఏ సరంజామాని అయినా తెలివిగా వాడేయడం తనకు తెలిసినంతగా వేరొకరికి తెలియదేమో!! `నోటా` ప్రచారంలో తనని విమర్శించిన బీజేపీ - కాంగ్రెస్ నాయకుల్ని నచ్చినట్టు వాడేశాడు. ఇప్పుడు రకరకాల యాస్ పెక్ట్స్ ని తెలివిగా ప్రచారానికి ఉపయోగించుకుంటున్నాడు.