విజయ్ దేవరకొండకు ఏం క్రేజో?

Update: 2018-09-29 18:09 GMT
'అర్జున్ రెడ్డి' సినిమాతో విజయ్ దేవరకొండ తెలుగు ప్రేక్షకులకే కాదు.. తమిళ జనాలకూ వెర్రెత్తించాడు. ఈ చిత్రం తమిళంలోనూ బాగా ఆడింది. ఆ తర్వాత ‘గీత గోవిందం’ సైతం తమిళనాట భారీ వసూళ్లు దక్కించుకుంది. తెలుగులోని చాలా మంది స్టార్ల కంటే విజయ్‌ కి తమిళంలో ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. ఇక ‘నోటా’తో నేరుగా తమిళ జనాల్ని పలకరించబోతున్నాడతను. ఈ చిత్రానికి అక్కడ మంచి క్రేజ్ వచ్చింది. విజయ్ అంటే  తమిళ జనాల్లో ఎలాంటి క్రేజ్ ఉందో చెప్పడానికి అతడిని తమిళ ‘బిగ్ బాస్’ రెండో సీజన్‌ గ్రాండ్ ఫినాలెకు ముఖ్య అతిథిగా ఆహ్వానించడమే రుజువు. కమల్ హాసన్ నిర్వహించే ఈ షోలో ఫినాలె ఎపిసోడ్‌ కోసం విజయ్ హౌస్ లోకి వెళ్లాడు.

ఈ సందర్భంగా హౌస్ మేట్ల నుంచే కాక.. బయట ప్రేక్షకుల నుంచి కూడా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీనికి సంబంధించిన ఫొటోలు.. ప్రోమో వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. మరి ఫైనల్ ఎపిసోడ్ లో విజయ్ ఎలా అక్కడి ప్రేక్షకుల్ని అలరిస్తాడో చూడాలి. తమిళులకు మామూలుగానే ప్రాంతీయ అభిమానం ఎక్కువ. అలాంటిది అక్కడ సూపర్ పాపులర్ అయిన టీవీ షో గ్రాండ్ ఫినాలెకు ఒక తెలుగు వాడిని ముఖ్య అతిథిగా ఆహ్వానించడం అంటే మామూలు విషయం కాదు. దీన్ని బట్టే అక్కడ మనోడి క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ‘నోటా’ కనుక హిట్టయితే అక్కడ విజయ్ రేంజే మారిపోతుందేమో.



Tags:    

Similar News