విజయ్ దేవరకొండ ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ క్రేజీ హీరో అని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. అర్జున్ రెడ్డి, గీత గోవిందం చిత్రాలతో యూత్ లో విపరీతమైన క్రేజ్ ను దక్కించుకున్న విజయ్ దేవరకొండలో పవన్ కళ్యాణ్ పోలికలు కనిపిస్తూ ఉంటాయని ఆయన అభిమానులు మరియు సాదారణ ప్రేక్షకులు కూడా అంటూ ఉంటారు. కెరీర్ ఆరంభంలో పవన్ కూడా యూత్ ఆడియన్స్ ను పిచెక్కించాడు. తన సినిమాలతో, తన సహజ సిద్దమైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా తన సహజ సిద్దమైన నటనతో అలరిస్తూ వస్తున్నాడు.
ఇంకా విజయ్ దేవరకొండలో పవన్ తాలూకు పోలికలు చాలా ఉన్నాయనే టాక్ వినిపిస్తూ వస్తోంది. పవన్ కళ్యాణ్ స్టార్ హీరోగా గుర్తింపు ఉన్నా కూడా తనకు సినిమాలపై ఆసక్తి లేదని, ఎప్పుడైనా సినిమాలు మానేస్తాను అంటూ చెబుతూ వచ్చేవాడు. ఇప్పుడు అదే విధంగా విజయ్ దేవరకొండ కూడా అంటున్నాడు. అర్జున్ రెడ్డి సినిమాతో మంచి విజయాన్ని దక్కించుకున్న విజయ్ దేవరకొండ ట్యాక్సీవాలా చిత్రం షూటింగ్ సమయం ఉండగా, ఆయన తల్లికి అనారోగ్యం చేసిందట. అయితే షూటింగ్ కారణంగా ఆమె వద్దకు వెళ్లి, ఆమెకు తోడుగా ఉండలేక పోయాడట. ఆ సమయంలో సినిమాలు మానేయాలనే ఆలోచన వచ్చిందట.
సినిమా వల్ల తన వారికి దగ్గరగా ఉండలేక పోతున్నానే అనే భావన రావడంతో ట్యాక్సీవాలా చిత్రం తర్వాత మళ్లీ నటించవద్దనుకున్నాను. తీసుకున్న అడ్వాన్స్ లు తిరిగి ఇవ్వాలనుకున్నాను. కాని మరోసారి ఆలోచించి వెనక్కు తగ్గినట్లుగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. సినిమాల్లో స్టార్ డం దక్కినా కూడా వరుసగా చిత్రాల్లో నటించాలనే తపన పవన్ లో కనిపించేది కాదు. ఇప్పుడు అలాగే విజయ్ దేవరకొండలో కూడా తన స్టార్ డంను ఉపయోగించుకుని వరుసగా చిత్రాలు చేయాలనే ఆలోచన ఉన్నట్లుగా అనిపించడం లేదు.