2 నెలల తర్వాత నన్ను చూసి షాక్‌ అవుతారు

Update: 2020-02-11 18:30 GMT
విజయ్‌ దేవరకొండ తన ప్రతి సినిమాకు కొత్తగా విభిన్నంగా కనిపించేందుకు ప్రయత్నిస్తున్నాడు. రెగ్యులర్‌ కమర్షియల్‌ చిత్రాలను చేసేందుకు విజయ్‌ దేవరకొండ ఆసక్తి చూపడం లేదు. ఈ వారంలో విజయ్‌ దేవరకొండ ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఈ చిత్రంలో విజయ్‌ మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు. ఈ మూడు గెటప్స్‌ లో శీనయ్య గెటప్‌ మినహా రెండు గెటప్స్‌ రెగ్యులర్‌ గానే ఉన్నాయి. అయితే రెండు నెలల తర్వాత నన్ను చూసి అంతా షాక్‌ అవ్వబోతున్నట్లుగా విజయ్‌ దేవరకొండ ప్రకటించాడు.

వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ చిత్రం ప్రమోషన్స్‌ లో భాగంగా విజయ్‌ దేవరకొండ మీడియాతో మాట్లాడుతూ రెండు నెలల తర్వాత తన లుక్‌ మరియు తన తీరు పూర్తిగా మారబోతుంది అంటూ ప్రకటించాడు. అది పూరి సినిమాలోనా లేదంటే మరో రకంగానా అనే విషయంను ఆయన చెప్పలేదు. కాని కొత్త విజయ్‌ ను చూస్తారని మాత్రం చాలా నమ్మకంగా బలంగా చెప్పాడు.

విజయ్‌ దేవరకొండ ఇప్పటి వరకు చేయని విభిన్నమైన నేపథ్యంలో మాత్రమే సినిమాలు చేస్తానంటున్నాడు. లవ్‌ స్టోరీ చిత్రాలను మళ్లీ చేయాలని అనుకోవడం లేదని మరోసారి విజయ్‌ దేవరకొండ చెప్పుకొచ్చాడు. తన కెరీర్‌ లో ఇప్పటికే చాలా చూశాను ఇంకా గొప్పగా ఏమైనా చూడాలని అనుకుంటున్నారా అన్నప్పుడు దేశానికి ప్రెసిడెంట్‌ గా తనను తాను చూసుకోవాలేమో అంటూ సరదాగా వ్యాఖ్యలు చేశాడు.
Tags:    

Similar News