విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్న 'గీత గోవిందం' చిత్రంతో ఎంతటి సెన్షేషన్ ను క్రియేట్ చేశారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు వారి కాంబోలో 'డియర్ కామ్రేడ్' చిత్రం రాబోతుంది. గీత గోవిందం చిత్రంలో ఒక్క ముద్దు సీన్ ఉంది. కాని డియర్ కామ్రేడ్ లో మాత్రం అర్జున్ రెడ్డిలో మాదిరిగా పలు ముద్దు సీన్స్ ఉన్నట్లుగా ట్రైలర్ చూస్తుంటే అనిపిస్తుంది. సినిమా విడుదల నేపథ్యంలో లిప్ లాక్ సీన్స్ కూడా అంచనాలను భారీగా పెంచేస్తున్నాయి. ఈనెల 26వ తారీకున సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో బెంగళూరులో మ్యూజిక్ ఫెస్టివల్ ను చిత్ర యూనిట్ సభ్యులు నిర్వహించారు.
బెంగళూరులో చిత్ర యూనిట్ సభ్యులు మీడియా సమావేశం కూడా నిర్వహించారు. ఈ సందర్బంగా మీడియా వారు ఇందులో కూడా లిప్ లాక్ సీన్స్ బాగానే ఉన్నట్లున్నాయిగా అంటూ విజయ్ దేవరకొండను ప్రశ్నించిన సమయంలో తనదైన శైలిలో స్పందించాడు. తనకు లిప్ లాక్ అనే పదమే నచ్చదు. మనిషికి సహజంగా వచ్చే ఎమోషన్స్ కోపం.. బాధ.. ప్రేమ మాదిరిగానే ముద్దు కూడా అని. దాన్ని లిప్ లాక్ అని ఎందుకు అంటారో నాకు అర్థం కాదు. నేను దాన్ని ఎక్కడైనా చూస్తే ఫక్ అని అర్థం చేసుకుంటాను. లిప్ లాక్ అనే పదం అర్థం లేని పదమంటూ విజయ్ చెప్పుకొచ్చాడు.
ఈ సినిమాలో ముద్దు అనేది రెండు పాత్రల మద్య ఉంటుంది. ముద్దు సీన్ లో నటించే సమయంలో నేను విజయ్ దేవరకొండ తను రష్మిక అనే విషయాన్ని మర్చి పోతాం. అందుకే ముద్దు సీన్స్ ను బాగా చేయగలుగుతాం. ఆ సీన్ చేసేప్పుడు తను లిల్లీ అయితే నేను బాబీ అంతే. అంతకు మించి మరో ఆలోచన ఏమీ ఉండదు. కథలో లీనమైతే ముద్దు సీన్స్ పెద్దగా తప్పు అని లేదంటే అతి అనిపించదని రౌడీ పేర్కొన్నాడు. భారీ అంచనాల నడుమ ఒకే సారి నాలుగు భాషల్లో విడుదల కాబోతున్న 'డియర్ కామ్రేడ్' చిత్రంపై విజయ్ దేవరకొండ చాలా చాలా నమ్మకంగా కనిపిస్తున్నాడు. మైత్రి మూవీస్ వారు నిర్మించిన ఈ చిత్రానికి భరత్ కమ్మ దర్శకత్వం వహించాడు.