అలా ప్లాన్ చేసిన దేవరకొండ

Update: 2019-09-26 07:10 GMT
ఒక సినిమాలో కంటెంట్ సూపర్ కావొచ్చు.. యావరేజ్ కావొచ్చు. కానీ దాంతో సంబంధం లేకుండా సినిమాపై బజ్ తీసుకురావాలంటే ఒకే మార్గం ఉంటుంది.. అవే ప్రమోషన్స్.  సరైన ప్రమోషన్స్ చేస్తే ఓపెనింగ్స్ కు గ్యారెంటీ ఉంటుంది. ఇక సినిమా రిలీజ్ తర్వాత మంచి టాక్ తెచ్చుకుంటే సినిమా సక్సెస్ గా నిలుస్తుంది.  గతంలో కంటే మన ఫిలిం మేకర్లు ప్రమోషన్స్ విషయంలో ఇప్పుడు విభిన్నమైన పంథా అనుసరిస్తున్నారు.  యువ హీరో విజయ్ దేవరకొండ అలా కొత్తగా ప్రమోషన్ ప్లాన్స్ వేయడంలో స్పెషలిస్ట్.

విజయ్ దేవరకొండ తొలిసారిగా నిర్మాతగా మారి నిర్మిస్తున్న చిత్రం 'మీకు మాత్రమే చెప్తా'.  ఈ సినిమాతో 'పెళ్ళిచూపులు' దర్శకుడు తరుణ్ భాస్కర్ ను హీరోగా టాలీవుడ్ కు పరిచయం చేస్తున్నాడు.  ఈ సినిమా అక్టోబర్ 18 న ప్రేక్షకుల ముందుకు రానుంది.  అయితే ఇప్పటివరకూ విజయ్ ప్రమోషన్స్ విషయం విషయంలో చొరవ చూపలేదు.  దీనికి ఒక కారణం ఉందట.  మరో వారంలోనే మెగాస్టార్ 'సైరా' రిలీజ్ కానుంది.  దీంతో ఈ సమయంలో 'మీకు మాత్రమే చెప్తా' అంటూ ఎంత హంగామా చేసినా జనాల ఫోకస్ పెద్దగా ఈ సినిమా పై ఉండదు. అందరి దృష్టి మెగాస్టార్ చిత్రం పైనే ఉంటుంది. అందుకే  'సైరా' హడావుడి తగ్గేవరకూ ప్రమోషన్స్ హంగామా లేకుండా చేసేందుకు ప్లాన్ చేశారట.

అయితే అప్పటిలోపు హీరో తరుణ్ భాస్కర్.. అనసూయ భరద్వాజ్.. మరి కొందరు నటులు కలిసి కాలేజిలను సందర్శిస్తూ ప్రమోషన్స్ మొదలు పెట్టారట.  ఈ సినిమా యూత్ ఫుల్ ఫిలిం కాబట్టి టార్గెట్ ఆడియెన్స్ ను డైరెక్ట్ గా కలవడం వల్ల సినిమాపై బజ్ పెంచవచ్చని ఇలా ప్లాన్ చేశారట.  'సైరా' హంగామా తగ్గిన తర్వాత మాత్రం స్పెషల్ ఈవెంట్స్.. ఇతఃర ప్రమోషన్స్ మొదలు పెడతారట.  ప్రస్తుతం 'మీకు మాత్రమే చెప్తా' టీమ్ ఒక ప్రమోషన్స్ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారట.  'సైరా' రిలీజ్ హడావుడి కాస్త సద్దుమణిగిన తర్వాతే ఈ పాటను రిలీజ్ చేస్తారట.  ఏదేమైనా రౌడీగారి ఐడియాలు ఇంట్రెస్టింగ్ గానే ఉంటాయి.  సైరా తర్వాతే హంగామా షురూ చేస్తారట!
    

Tags:    

Similar News