ఈ సాయంత్రం `సవ్యసాచి` ప్రీరిలీజ్ సాక్షిగా ఓ అరుదైన సన్నివేశం. ఈ వేదిక సాక్షిగా చైతూ - దేవరకొండ ఎంత మంచి స్నేహితులో రివీలైంది. ఆ ఇద్దరి మధ్యా పరిచయం, స్నేహం ఎంత గమ్మత్తుగా సాగిందో దేవరకొండనే స్వయంగా లీక్ చేశాడు. తన లైఫ్ జర్నీలో తాను నటుడవ్వాలనుకున్నప్పుడు అన్నపూర్ణ స్టూడియో గేట్ లోంచి లోనికెళ్లాలని చూశాడట. ఆ టైమ్ లో ఎంతో భయం. అసలు లోనికెళ్లనిస్తారా.. వెళ్లనివ్వరా? అలాంటి కుర్రాడు ఇప్పుడు ఏకంగా ఒక స్టార్ అయ్యాడు. నాగచైతన్య ఉన్న వేదికపై స్పెషల్ గెస్టుగా వచ్చాడంటే అతడి అదృష్టాన్ని ఏమని పొగడాలి?
ఇదే వేదికపై కీరవాణితో పరిచయం ఎంత గమ్మత్తుగా సాగిందో.. దేవరకొండ తెలిపాడు. దేవరకొండ మాట్లాడుతూ-``ఓసారి ముంబై నుంచి విమానంలో ప్రయాణించేప్పుడు కీరవాణి గారు నా వెనక సీట్లో కూచున్నారు. అప్పుడు తినడానికి ఫుడ్ ఆర్డర్ చేస్తే నా జేబులో డబ్బుల్లేవ్. కీరవాణిగారే ఆ డబ్బులు పే చేశారు. మన జేబులో ఎప్పుడూ డబ్బులుండవ్! `` అని చెప్పాడు.
నాకు చై అంటే చాలా ఇష్టం.. ఒక్కసారే కలిసాను... ఇండస్ట్రీలో ఎవరూ ఫ్రెండ్స్ లేరు. కానీ చై అమేజింగ్.. చిల్డ్ గయ్... స్ట్రెస్ ఫ్రీ అనిపిస్తాడు. తనతో ఉంటే అన్నీ మర్చిపోవచ్చు.. అని అన్నాడు. డిగ్రీలో ఉన్నప్పుడు... నటుడవ్వాలనుకున్నా... అప్పట్లో అన్నపూర్ణ స్టూడియోస్‌లో వినోద్ బాలా వర్క్ షాప్ జరుగుతోంది. అక్కడ చై ప్రాక్టీస్ చేస్తున్నారు. నేను అది చూడటానికి వెళ్లాను. అలా వెళ్లినప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ గేట్‌లోకి రానిస్తారా? అనుకున్నా.. లోనికి వెళ్లేందుకు భయపడ్డాను. అయితే ఆ తర్వాత లోనికి వెళ్లి.. అక్కడ కూచుని చైతూ ఏం చేస్తున్నాడో తన వర్క్ ఏంటో చూశాను. అప్పటికి శివ - క్రిమినల్ గోవిందా గోవిందా చూసి నాగ్ సర్ అంటే ఓ పిచ్చి ఉండేది. అన్నపూర్ణ అంటే అదర్ వరల్డ్ అనుకునేవాడిని. ఇప్పుడు అలాంటి చోట పరిశ్రమలో నేను ఒక పార్ట్ అవ్వడం ఆనందంగా ఉంది`` అంటూ దేవరకొండ చిల్ అయ్యారు. ఈ వేదికపై దేవరకొండ పెర్ఫామ్ చేసినప్పుడు, తనకు చై అభిమానులు జై కొట్టారు. వేడుక ఆద్యంతం దేవరకొండ హుషారైన మాటలకు అభిమానులు ఉరకలెత్తారు.