హీరోలు పాటలు పాడడం అన్నది నేటి ట్రెండ్. టాలీవుడ్ లో అగ్ర హీరోలతో పాటు యువహీరోలు పాటలు పాడేస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్లు- డైరెక్టర్లు హీరోల్ని ఒప్పించి చొరవగా పాటలు పాడించేస్తున్నారు. ఇవన్నీ సినిమాల ప్రమోషన్స్ కోసం చేస్తున్న జిమ్మిక్కులేనని చెప్పొచ్చు. అయితే ఇదే తరహా ప్రమోషన్స్ కోసం తనతో పాటు మరో ఇద్దరు హీరోల్ని ముగ్గులోకి దించేసిన విజయ్ దేవరకొండ నైపుణ్యం గురించి ఫిలింసర్కిల్స్ లో ఆసక్తిగా ముచ్చటించుకుంటున్నారంతా.
దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ చిత్రాన్ని ఈ నెలాఖరున రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఇప్పటికే ప్రచారంలో టీమ్ స్పీడ్ పెంచింది టీమ్. తెలుగు-తమిళం- మలయాళం- కన్నడలో ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా రిలీజ్ చేస్తుండడంతో ఆ మేరకు ప్రచారంలోనూ వైవిధ్యం పాటిస్తున్నారు. ప్రతి భాషలోనూ ఆడియెన్ కి కనెక్టయ్యేందుకు నేరుగా రీచబుల్ మెట్రో నగరాల్లో ప్రత్యేకించి ప్రచార కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పటికే బెంగళూరు.. కొచ్చీ వంటి చోట్ల దేవరకొండ- రష్మిక బృందం ప్రమోషన్స్ ని పరుగులు పెట్టించారు. ఆసక్తికరంగా ఇప్పుడు కన్నడ-మలయాళ వెర్షన్ల ప్రమోషన్స్ కోసం ఏకంగా దుల్కార్ సల్మాన్ .. విజయ్ సేతుపతి లాంటి క్రేజీ హీరోల్ని కాకా పట్టేశాడు మన రౌడీ.
కామ్రేడ్ ప్రచారార్భాటానికి సంబంధించిన ఓ పాటను తెలుగు వెర్షన్ వరకూ తాను పాడేస్తున్న విజయ్ ..కన్నడ కోసం దుల్కార్ ని.. తమిళం కోసం సేతుపతిని ఒప్పించేశాడు. మొత్తంగా దేవరకొండ ప్రయత్నం చూస్తుంటే ఆల్ సౌతిండియా రికార్డుల్ని తిరగరాయాలన్న పంతం కనిపిస్తోంది. ఇప్పటికే డియర్ కామ్రేడ్ ట్రైలర్ కి అద్భుత స్పందన వచ్చింది. ప్రేమికుడిలో విప్లవం పాత్రలో ఘాడత ఉందన్న టాక్ వినిపించింది. మరోసారి అర్జున్ రెడ్డిలా ఏదైనా మ్యాజిక్ చేస్తాడా అన్న టాక్ వినిపిస్తోంది. అందుకే ఈ కాన్ఫిడెన్స్ తోనే మైత్రి సంస్థకు అన్ని రకాలుగా ప్రచారం పరంగా దేవరకొండనే కొండంత అండగా నిలుస్తున్నాడట.