విజయ్ దేవరకొండ స్టార్ డమ్ తారా స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం అతని క్రేజ్ కేవలం తెలుగు రాష్ట్రాల వరకే పరిమితం కాదు. ఇరుగు పొరుగు పరిశ్రమల్లోనూ మనోడి లెవల్ పెరిగింది. అర్జున్ రెడ్డి- గీత గోవిందం అతడికి ఆ స్థాయిని ఇచ్చాయి. కొన్ని వరుస బ్లాక్ బస్టర్ల తర్వాత `డియర్ కామ్రేడ్` కొంత నిరాశపరిచినా అతని ఇమేజ్ కి ఏమాత్రం డ్యామేజ్ అన్నదే లేదు. ఫ్యాన్ బేస్ ని `డియర్ కామ్రేడ్`తో మరింతగా పెంచేసుకున్నాడని చెప్పొచ్చు. ఆ క్రమంలోనే అతడి కొత్త స్నేహాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అతడు పాన్ ఇండియా లెవెల్లో స్టార్ గా ఎదిగిపోవాలని కొత్త కలలు కంటున్నాడు. అందుకు కాలం కూడా అతనికి తోడుగా నిలుస్తూ క్రేజీ ఫిల్మీ పీపుల్ ని.. గ్లామర్ అండ్ గ్లిడ్జ్ తెలిసిన వారిని అతనికి దగ్గర చేస్తోంది. విజయ్ త్వరలో బాలీవుడ్ లోనూ సత్తాను చాటాలని అటు వైపుగా అడుగులు వేస్తున్నాడన్నది కాదనలేని నిజం.
ఇటీవల విజయ్ దేవరకొండ బాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ కం ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ని.. స్పెషలిస్ట్ డిజైనర్ మనీష్ మల్హాత్రాని కలిసిన విషయం తెలిసిందే. కరణ్ సమక్షంలో ఓ ఫోటోషూట్ లోనూ పాల్గొన్నాడు. అనంతరం కరణ్ భాయ్ ఇచ్చిన పార్టీలో ప్రత్యేక సూట్ లో మెరిసిన విజయ్ దేవరకొండ ఈ పార్టీకి స్లిప్పర్స్ తో వెళ్లడం అక్కడ ఉన్న ఖరీదైన ఫేజ్ 3 బాబుల దృష్టిని ఆకర్షించింది. క్లాసీ నేవీ బ్లూ సూట్ లో పార్టీ క్రౌడ్ లోకి ఎంటరైన విజయ్ షూస్ ని కాకుండా స్లిప్పర్స్ (చెప్పులు) వేసుకోవడం ఆకట్టుకుంది. కేవలం జమీందారీ రేంజు వారికి మాత్రమే అందుబాటులో ఉండే ప్రఖ్యాత గుస్సి బ్రాండ్ స్లిప్పర్స్ తో రౌడీ హీరో పార్టీలో హల్చల్ చేశాడు. ఆ చెప్పుల ఖరీదు అక్షరాలా రూ.45 వేలు. ఇదే పార్టీలో కియారా అద్వానీతో పాటు బాలీవుడ్ స్టార్స్ చాలా మంది పాల్గొన్నారు. అక్కడి నుంచి విజయ్ బ్యాంకాక్ చెక్కేశాడు.
బాలీవుడ్ లీడింగ్ వెబ్ పోర్టల్.. విజయ్ బాలీవుడ్ ఎంట్రీ వ్యవహారంపై విజయ్ ని ఆరా తీసే ప్రయత్నం చేసింది. అయితే మన రౌడీ బోయ్ ఎంతో తెలివిగా ఆన్సర్స్ ఇచ్చి అప్పటికి తప్పించుకున్నాడు. ``అది ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుంది. నేను కూడా ఆ సమయం కోసం ఎదురుచూస్తున్నాను. అలా అని ఊపిరి బిగపట్టుకుని ఎదురుచూడటం లేదు`` అంటూనే.. పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల్ని అలరించాలని వుందని మనసులోని కోరికను బయటపెట్టేశాడు. అది బాలీవుడ్ ఎంట్రీతోనే సాధ్యమవుతుందని నాకూ తెలుసు. తెలుగుతో పోలిస్తే నాకు బాలీవుడ్ అనేది ఎక్స్టెన్షన్ మాత్రమే` అని తెలివిగా సమాధానం ఇచ్చాడు రౌడీ బోయ్. ఇంతకీ ఆ పార్టీలో విజయ్ తొడుక్కున్న చెప్పుల ఖరీదు ఎలా బయటకు లీకైంది? అంటే .. ఖరీదైన ఫేజ్ 3 ప్రపంచంతో అంటకాగే మీడియాల పని అదేగా.. అంతేగా!!