బ్రెజిల్ పాపతో విజయ్ ఫోటో వైరల్ అయిందే!

Update: 2019-06-21 16:34 GMT
టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం రెండు మూడు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు.  'డియర్ కామ్రేడ్' రిలీజ్ కు రెడీ అవుతోంది.  మరోవైపు క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఒక సినిమా షూటింగ్ దశలో ఉంది.. ఈ సినిమా కాకుండా తమిళ దర్శకుడు ఆనంద్ అన్నామలై డైరెక్షన్లో మరో సినిమా కూడా సెట్స్ పై ఉంది.  ఇన్ని సినిమాలు లైన్లో ఉన్నాయి కాబట్టే రౌడీగారి గురించి నాలుగు రోజులకొకసారి ఏదో ఒక అప్డేట్ వస్తూనే ఉంటుంది. తాజాగా అలాంటి అప్డేటే వచ్చింది.

క్రాంతి మాధవ్ సినిమాలో విజయ్ సరసన ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్న సంగతి తెలిసిందే.  ఆ ముగ్గురిలో ఒకరు ఇజబెల్  లీట్.  ఈ బ్రెజిలియన్ పాప మహా అందంగా ఉంటుంది.  ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.  రీసెంట్ గా ఈ భామ తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది.  ఈ ఫోటోలో తనతో పాటుగా విజయ్ దేవరకొండ కూడా ఉన్నాడు.  ఇద్దరూ తమ నాలుకలు బైట పెట్టి కొంటెగా నవ్వుతూ ఒక కిరాక్ పోజిచ్చారు.  ఈ ఫోటోకు  "ఈ రౌడీ నాకు కో-స్టార్.. నేనెంతో లక్కీ" అంటూ ఇజబెల్ క్యాప్షన్ ఇచ్చింది.

ఈ ఫోటో ఫ్రాన్స్ లో తీసినదని వెల్లడించింది.  అంతే కాకుండా తన ట్విట్టర్ ఖాతా ద్వారా "ఫ్రాన్స్ లో సమయం అద్భుతంగా గడించింది.  అన్నీ కొత్త అనుభవాలే. చాలా అదృష్టవంతురాలిని. అప్పుడే వాటిని మిస్ అవుతున్నా.  ప్రస్తుతం నా కుటుంబంతో గడిపేందుకు బ్రెజిల్ వచ్చాను" అంటూ తన ఫ్రాన్స్ అనుభవాల గురించి వెల్లడించింది. 


Tags:    

Similar News