ఏ ఇతర ఇండస్ట్రీలో లేనంతగా కోలీవుడ్ తో రాజకీయాలు ముడిపడి ఉంటాయన్నది అనాదిగా తెలిసిన విషయమే. ఎంజీఆర్ - కరుణానిధి- జయలలిత రోజుల నుంచి పరిశ్రమలో రకరకాల ఎపిసోడ్లు తెలిసినవే. ముఖ్యంగా రజనీకాంత్ .. కమల్ హాసన్ సినిమాల్ని రిలీజ్ కానివ్వకుండా అమ్మ జయలలిత చేసిన రాజకీయాలు హిస్టరీలో నిలిచిపోయాయి. అన్నా డీఎంకే పార్టీపై మంటతోనే రజనీ.. కమల్ వంటి వాళ్లు రాజకీయాల పేరుతో దోబూచులాటలు ఆడుతున్నారు. కమల్ ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండగా.. రజనీకాంత్ త్వరలో పార్టీ ని ప్రకటించేందుకు సిద్ధమవుతూ అనారోగ్యం వల్ల వాయిదా వేసుకున్నారు.
రాజకీయాల్లో ఉంటేనే తమిళనాట తమ సినిమాల్ని సవ్యంగా రిలీజ్ చేసుకునేంత దారుణ పరిస్థితి ఉంటుంది. అక్కడ సినిమాలపై రాజకీయాల ఉచ్చును తొలగించడం అంత సులువేమీ కాదు. నాయకుడిని ప్రసన్నం చేసుకుంటేనే ఏదైనా క్లారిటీగా ఉంటుంది. సమస్యల్లేకుండా రిలీజ్ చేస్తేనే జనాల్ని థియేటర్లకు రప్పించగలిగే పరిస్థితి ఉంటుంది.
ఇప్పుడు విజయ్ సైతం తన సినిమా మాస్టర్ ని సంక్రాంతి బరిలో రిలీజ్ చేసుకోవాలంటే అధికార అన్నాడీఎంకే పార్టీని కలవాల్సి ఉంటుంది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాటి పళనిస్వామితో దళపతి విజయ్ సమావేశం అందుకే ఆసక్తికరంగా మారింది. మీకు మా మద్ధతు ఉంటుంది. మాకు మీ మద్దతు కావాలి! అన్న ప్రాతిపదికన విజయ్ మంతనాలు సాగించారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. క్రైసిస్ వేళ థియేటర్ల పరంగా సమస్యలేవీ ఉత్పన్నం కాకుండా రిలీజ్ పరంగా ఇబ్బందుల్లేకుండా చూసేందుకే విజయ్ ఇలా ముందస్తుగా తెలివైన ఎత్తుగడ వేశారన్న చర్చా వేడెక్కిస్తోంది.