సౌత్ స్టార్‌ బాలీవుడ్‌ మూవీ అప్ డేట్

Update: 2021-02-02 16:30 GMT
తమిళ విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి హీరోగానే కాకుండా విలన్ గా క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ఇతర భాషల్లోనూ నటిస్తు మెప్పిస్తున్నాడు. వరుసగా విజయ్ సేతుపతి సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సొంతం చేసుకోవడంతో పాటు విభిన్నమైన పాత్రలు పోషిస్తూ సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా మంచి పేరు తెచ్చుకుంటున్న విజయ్‌ సేతుపతి బాలీవుడ్‌ ఎంట్రీకి సిద్దం అయ్యాడు. బాలీవుడ్ స్టార్‌ డైరెక్టర్‌ శ్రీరామ్‌ రాఘవన్‌ దర్శకత్వంలో విజయ్ సేతుపతి ఒక సినిమాను చేసేందుకు ఓకే చెప్పాడు. అంధాదున్‌ తో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న శ్రీరామ్‌ రాఘవన్‌ మరో విభిన్నమైన సినిమాను సేతుపతితో చేయబోతున్నాడు.

ఈ సినిమా లో విజయ్‌ సేతుపతికి జోడీగా బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కత్రీనా కైఫ్‌ నటిస్తుంది. ఈ కాన్సెప్ట్‌ ఓరియంటెడ్‌ సినిమాను ఏప్రిల్‌ నెల నుండి మొదలు పెట్టబోతున్నారట. పూణే లో ఈ సినిమా కోసం ప్రత్యేకంగా వేసిన సెట్టింగ్‌ లో షూటింగ్‌ ను షురూ చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇక విజయ్ సేతుపతి తమిళం.. తెలుగు.. హిందీతో పాటు పలు భాషల్లో డజనుకు పైగా సినిమాలు ఇప్పటికే చేస్తున్నాడు. మరి కొన్ని కూడా లైన్‌ లో ఉన్నాయి. వాటి విషయమై మరి కొన్ని రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Tags:    

Similar News