టాలెంటెడ్ యాక్టర్ విజయ్ సేతుపతి వరుస సినిమాలతో బిజీ అవుతున్నారు. ఆల్రెడీ రిలీజ్ కావాల్సిన సినిమాలు లైన్ లో ఉండగానే కొత్త సినిమాలు ఓకే చేస్తున్నాడు. అయితే కొన్ని సినిమాలు హీరోగా చేస్తూనే మరికొన్ని సినిమాల్లో కీలక పాత్రలు చేస్తున్నాడు. గతేడాది సైరా నరసింహారెడ్డి సినిమాతో తెలుగులో ఆరంగేట్రం చేశాడు విజయ్ సేతుపతి. ఆ సినిమా తెలుగు తమిళమే కాకుండా హిందీ కన్నడ మలయాళం ఇండస్ట్రీలకు కూడా విజయ్ ని పరిచయం చేసింది. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్న విజయ్ మరో కొత్త సినిమాను ఓకే చేశాడు. ఈ సినిమాతో వెంకట కృష్ణ రోహంత్ అనే కొత్త దర్శకుడు పరిచయం కానున్నాడు.
ఈ సినిమాకు 'యాధూమ్ ఊరే యావరమ్ కెలిర్' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అన్నట్లు సినిమా టైటిల్ కూడా విజయ్ సూచించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగానే ఇటీవల మరో రెండు కొత్త సినిమాలు ఓకే చేసాడు విజయ్. అందులో ఒకటి క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ఒకటి కాగా.. సమంత-నయనతార కాంబినేషన్లో మరొకటి. ఇలా దాదాపు విజయ్ సేతుపతి చేతిలో పన్నెండు సినిమాలు ఉన్నట్లు తెలుస్తుంది. అంటే దాదాపు వచ్చే రెండు సంవత్సరాల వరకు ఆయన బిజీ ఉండబోతున్నాడు అన్నమాట. ఇక ఈ మధ్య కరోనా టైంలో ఓటిటిలు తెగ పాపులర్ అయిన సంగతి తెలిసిందే.
క్యారెక్టర్ ఆర్టిస్టుల దగ్గర నుండి మొదలుకొని స్టార్ హీరోలు హీరోయిన్ల వరకు ఓటిటి వైపు అడుగులు వేస్తున్నారు. ఇటీవలే స్టార్ హీరోలు మంచి కాన్సెప్ట్స్ ఉంటే ఓటిటిలోకి రావడానికి సిద్ధం అని హింట్ ఇచ్చారు. అయితే తాజాగా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కూడా ఓటిటిలో అడుగు పెట్టబోతున్నాడట. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అయితే విజయ్ ఇప్పటికే రెండు టాప్ ఓటిటిలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు. అధికారిక ప్రకటన త్వరలో రానుందని అంటున్నారు. అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే.