తమిళ నటుడు - దర్శకుడు - రచయిత అయిన విజయ్ సేతుపతి ఇటీవల కాలంలో ఎంతగా పాపులర్ అయ్యాడో తెలిసిందే. వరుస సినిమాలతో నిమిషం కూడా ఖాళీ లేకుండా ఫుల్లు బిజీగా మారిపోయాడాయన. విజయ్ సేతుపతికి రీసెంటుగా ఓ సీనియర్ హీరో నుంచి ఫోన్ కాల్ వచ్చిందట.. ఆయన ఫోన్ చేసి తెగ మెచ్చుకున్నాడట. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు.. తమిళ స్టైలిష్ స్టార్ అజిత్. ఆయన ఫోన్ అందుకున్న విజయ్ ఫుల్ హ్యాపీగా ఫీలయ్యారట..కానీ, విజయ్ భార్య మాత్రం కోపం తెచ్చుకుందట. అందుకు కారణం కూడా ఉంది.. అజిత్ విషయంలో విజయ్ తనకు ఇచ్చిన హామీని నెరవేర్చకపోవడంతోనే ఆమె ఫీలయిపోయిందట.
విజయ్ భార్య జెస్సీ సేతుపతి అజిత్ కు వీరాభిమాని. వివేగమ్ మూవీ షెడ్యూల్ బ్రేక్ సమయంలో భర్తతో కలసి వెళ్లి అజిత్‌ను కలవాలని జెస్సీ ప్లాన్ చేసుకుంది. ఈ విషయాన్ని ఆమె భర్త విజయ్ మరిచిపోయాడు. అందుకే అజిత్ తనకు ఫోన్ చేసి ప్రశంసించాడని చెప్పగానే ఆమె సంతోషించకపోగా.. అజిత్ ఫోన్ చేస్తే తన గురించి గానీ, తామిద్దరం కలవాలని ప్లాన్ చేసుకున్న విషయాన్ని చెప్పలేదని విజయ్ పై జెస్సీ అలిగారట.
కాగా విజయ్ కు ఈమధ్య పెద్ద హీరోలంతా ఫోన్ చేసి అభినందిస్తున్నారు. ఇంతకుముందు రజనీకాంత్ కూడా ఆయనకు ఫోన్ చేశారు. దీంతో కోలీవుడ్ లో ఇప్పుడు విజయ్ సేతుపతి హాట్ టాపిగ్గా మారిపోయారట. అగ్రహీరోలంతా ఆయన్ను మెచ్చుకుంటున్నారట.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/