విజయ్ సేతుపతి గొప్ప మనసు: రైతుల కోసం భవనం...

Update: 2019-10-19 16:53 GMT
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి....తమిళ్ వర్సటైల్ హీరో. హీరోగానే గాకుండా, నటుడుగా అద్భుతమైన పాత్రలు పోషిస్తూ తమిళంలోనే గాకుండా, తెలుగు, మలయాళంలో కూడా అభిమానులు సంపాదించుకున్నారు. విజయ్ సినిమాల్లో నటించడంతో పాటు బయట కూడా ప్రజలకు అనేక మంచి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. అటు బుల్లితెరపై ఓ టాక్ షో ప్రారంభించి.. అనేకమంది పేదవారికి అండగా నిలుస్తున్నారు. అయితే తాజాగా రైతుల కోసం ఓ మంచి నిర్ణయాన్ని తీసుకున్నారు.  

ఇటీవల మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమాలో కూడా ఓ ముఖ్యపాత్ర పోషించి అభిమానులని మెప్పించిన విజయ్...తాజాగా 'లాభం' అనే చిత్రంలో నటిస్తున్నారు. ప్రజలకు మంచి మెసేజ్ స్టోరీలు తెరకెక్కించే సీనియర్ డైరెక్ట‌ర్ ఎస్.ఫై.జననాథ‌న్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. షూటింగ్ సందర్భంగా ఈ సినిమాలో రైతులకు సంబంధించిన భవనం అవసరమైంది. దీంతో చిత్ర యూనిట్ ఓ సెట్ వేయాలని నిర్ణయించుకున్నారు.

అయితే అలాంటి సెట్ ఏం వద్దని, నిజమైన రైతులు ఉండే ఊరులోనే చిత్రీకరణ జరుపుదామని విజ‌య్ సేతుప‌తి చెప్పారు. అలాగే అక్కడ రైతు సంఘం కోసం ఒక భవనం నిర్మించి, అందులో షూటింగ్ చేద్దామని చిత్రయునిట్ కు చెప్పారు. ఇక షూటింగ్ పూర్తయ్యాక ఆ ఊరి ప్రజలకే భవనాన్ని అప్పగించాలని కోరారట. ఈ నిర్ణయంపై చిత్ర యూనిట్ విజయ్ సేతుపతిని అభినందించింది. అలాగే గ్రామ ప్రజలు కూడా కూడా హర్షం వ్యక్తం చేశారు. మొత్తానికి విజయ్ సేతుపతి తీసుకున్న నిర్ణయం పట్ల నెటిజన్లు కూడా హేట్సాఫ్ చెబుతున్నారు. విజయ్‌ది మంచి మనస‌ని ప్రశంసిస్తున్నారు.
Tags:    

Similar News