మెగా స్టార్ చిరంజీవి - విలక్షణ దర్శకుడు సురేందర్ రెడ్డి ల కాంబోలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం `సైరా నరసింహా రెడ్డి`పై టాలీవుడ్ లో భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తో పాటు తమిళ నటుడు విజయ్ సేతుపతి - కిచ్చ సుదీప్ - నయనతార - తమన్నావంటి స్టార్ కాస్ట్ ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి లీకయిన కీలకమైన యుద్ధ సన్నివేశం ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా, ఈ చిత్రానికి సంబంధించిన మరో కీలకమైన విషయాన్ని విజయ్ సేతుపతి వెల్లడించాడు. తమిళ్ మాట్లాడే ఓ యోధుడి పాత్రలో తాను కనిపించబోతున్నానని విజయ్ తన క్యారెక్టర్ ను రివీల్ చేశాడు. త్వరలోనే తాను సైరా సెట్స్ పైకి రాబోతున్నట్టు విజయ్ చెప్పాడు.
బ్రిటిష్ వారిని గడగడలాడించిన ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి......తమిళులు - తెలుగువారిని కలిపి ఒకేతాటిపైకి తెచ్చారని....ఈ నేపథ్యంలోనే తన పాత్ర సినిమాలోకి ఎంటరవుతుందని విజయ్ వెల్లడించాడు. తమిళ ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తిగా - తమిళ-తెలుగు భాషల్ని కలగలిపి మాట్లాడే క్యారెక్టర్ ను తాను పోషించానని చెప్పాడు. బ్రిటిష్ పాలకులపై పోరాడేందుకు రెండు ప్రాంతాలు, రెండు భాషల్ని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఏవిధంగా ఒక్క తాటిపైకి తీసుకొచ్చాడనే దశలో తన పాత్ర పరిచయమవుతుందని చెప్పాడు. ఇదే తన తొలి తెలుగు స్ట్రయిట్ సినిమా అని , త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతున్నానని చెప్పాడు. విక్రమ్ వేదతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విజయ్....తాజాగా విడుదలై `జుంగా`లో నటించాడు. ఈ చిత్ర ప్రమోషన్ లో భాగంగా సైరా గురించిన విషయాలు వెల్లడించాడు.