అరవ డబ్బింగ్ పైత్యానికి పరాకాష్ట

Update: 2016-09-11 22:30 GMT
తమిళ సినిమాలు మన సినిమాల కంటే వైవిధ్యంగా ఉంటాయి.. అక్కడ మంచి మంచి ప్రయోగాలు జరుగుతుంటాయన్నది వాస్తవం. అలాగని ప్రతి తమిళ సినిమా బాగుంటందనుకుంటే పొరబాటే. కానీ తమిళ డబ్బింగ్ సినిమా అనగానే మన జనాలు వేలం వెర్రిగా థియేటర్లకు వచ్చేస్తారనే భ్రమల్లో అప్పుడప్పుడూ అర్థం పర్థం లేని సినిమాల్ని అనువాదం చేసి వదిలేస్తుంటారు కొందరు నిర్మాతలు. తెలుగు నుంచి తమిళంలోకి రీమేక్ అయిన సినిమాల్ని.. ఆల్రెడీ తెలుగులోకి రీమేక్ అయిన చిత్రాల్ని డబ్బింగ్ చేయడం.. ఒక హీరోకు కొత్తగా కొంచెం క్రేజ్ వచ్చిందనగానే ఆ హీరో పాత సినిమాలన్నింటినీ కొత్తగా అనువాదం చేసి రిలీజ్ చేయడం లాంటి పైత్యాలు అప్పుడప్పుడూ చూస్తుంటాం.

తాజాగా ‘మాస్ రాజా’ పేరుతో తెలుగులోకి వస్తున్న సినిమా కూడా అలాంటిదే. ఈ మధ్య ‘జిల్లా’ సినిమాతో తెలుగులో కొంచెం క్రేజ్ సంపాదించుకున్నాడు విజయ్. దీంతో అతడి పాత కొత్త సినిమాలన్నింటినీ తెలుగులోకి దించేస్తున్నారు. ఈ కోవలోనే ఎప్పుడో పదేళ్ల కిందట రిలీజైన ‘శివకాశి’ని ‘మాస్ రాజా’ పేరుతో అనువాదం చేశారు. ఈ సినిమా ఆల్రెడీ ‘విజయదశమి’ పేరుతో కళ్యాణ్ రామ్ హీరోగా రీమేక్ అయింది. ఫ్లాప్ అయింది. అయినా పోస్టర్లలో విజయ్ లేటెస్ట్ లుక్ చూపిస్తూ యాడ్స్ ఇచ్చారు. అసిన్ సౌత్ ఇండియాలో గత ఐదారేళ్లుగా నటించలేదన్న సంగతి తెలిసిందే. ‘మాస్ రాజా’లో ఆమే హీరోయిన్. ఐటెం  సాంగ్ చేసిన నయనతారను కూడా ప్రముఖంగా చూపిస్తున్నారు. ఈ మధ్యే ‘రెడీ’ రీమేక్ ను తిరిగి తెలుగులోకి ‘నారదుడు’ పేరుతో అనువాదం చేశారు. దాన్ని పట్టించుకున్న నాథుడు లేడు. మరి ‘మాస్ రాజా’ పరిస్థితేంటో చూడాలి.
Tags:    

Similar News