తమిళ సూపర్ స్టార్ విజయ్ తనయుడు జాసన్ తెరంగేట్రం కోసం ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చిన్నతనంలోనే నాన్నతో కలిసి ఒక చిత్రంలో నటించిన జాసన్ హీరోగా పరిచయం అయ్యే సమయం వచ్చిందని వెంటనే జాసన్‌ను హీరోగా పరిచయం చేయాలంటూ గత ఏడాది కాలంగా విజయ్ ను సోషల్ మీడియా వేదికగా కోరుతూనే ఉన్నారు. ఫ్యాన్స్ చేస్తున్న పోస్ట్‌లకు విజయ్ కూడా అప్పుడప్పుడు స్పందిస్తూ ఉంటాడు. జాసన్ విషయంలో నిర్ణయం తీసుకునేందుకు మరికాస్త సమయం పట్టనుందని కొన్నాళ్ల క్రితం చెప్పాడు.
ఇటీవలే జాసన్ ఒక ష్టార్ట్ ఫిల్మ్ తెరకెక్కించాడు. అందులో నటించడంతో పాటు దర్శకత్వం కూడా వహించిన జాసన్ మెప్పించాడు. షార్ట్ ఫిల్మ్‌లో జాసన్ లుక్ బాగుందని తప్పకుండా తండ్రికి తగ్గ తనయుడు అవుతాడంటూ ఫ్యాన్స్ నమ్ముతున్నారు. విజయ్ తర్వాత స్థానంను ఆయనే భర్తీ చేస్తాడంటూ చాలా నమ్మకంగా ఉన్నారు. విజయ్ తనయుడు జాసన్ మాత్రం నటనపై ఆసక్తిని కనబర్చడం లేదట. ఆయనకు ఎక్కువగా దర్శకత్వంపై ఆసక్తి ఉంటుందని నిర్మాత జేవియర్ బ్రిట్టో అన్నాడు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో జేవియర్ మాట్లాడుతూ.. విజయ్ తనయుడు జాసన్ ఎంట్రీ కోసం చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే అతడికి మాత్రం నటనపై ఆసక్తి ఉన్నట్లుగా అనిపించడం లేదు. ప్రస్తుతం కెనడాలో ఫిల్మ్ మేకింగ్ కోర్సును చేస్తున్నాడు. అందులో భాగంగా అతడు దర్శకత్వంపై మెలకువలు నేర్చుకోవడంతో పాటు హాలీవుడ్ స్థాయి టెక్నీషియన్స్‌తో పని చేస్తున్నాడు. అలాగే నటనపై కూడా అతడు శిక్షణ తీసుకుంటున్నాడు. ప్రస్తుతానికి జాసన్ దృష్టి అంతా కూడా దర్శకత్వంపైనే ఉందని ఆయన అన్నాడు. మరి రాబోయే కాలానికి జాసన్ మనసు మార్చుకుంటాడా లేదా అనేది చూడాలి.