పాప్ కార్న్ అమ్ముతున్న సూపర్ స్టార్ భార్య

Update: 2016-11-11 05:36 GMT
సూపర్ స్టార్ భార్య పాప్ కార్న్ అమ్మడం ఏంటి అంటారా...? ఇదంతా ఒక మంచి కార్యక్రమం కోసం చేస్తున్న పనిలెండి. జెమిని టీవీలో ప్రసారమయ్యే ‘మేము సైతం కార్యక్రమం కోసం సూపర్ స్టార్ కృష్ణ సతీమణి విజయ నిర్మల పాప్ కార్న్ అమ్మే పనిలో పడ్డారు. హైదరాబాద్ లోని ఒక ఏరియాలో ఆమె రోడ్డు మీదికి వచ్చి పాప్ కార్న్ అమ్మకాలు చేపట్టారు.

ఓ కుటుంబాన్ని ఆదుకోవడం కోసం ఆమె ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణ అభిమానులతో సరదాగా మాట్లాడుతూ.. జోకులేస్తూ పాప్ కార్న్ అమ్మకాలు చేపట్టారు. విజయనిర్మల ప్రోగ్రాం ఈ శనివారం రాత్రి 9.30 గంటలలకు జెమిని టీవీలో ప్రసారమవుతుంది. ‘మేము సైతం’ కార్యక్రమంలో ఇప్పటిదాకా చాలా వరకు యువ హీరో హీరోయిన్లే ఎక్కువగా అతిథులుగా వచ్చారు.

మోహన్ బాబు లాంటి ఒకరిద్దరు తప్ప సీనియర్ ఆర్టిస్టులు వచ్చింది లేదు. ఈ నేపథ్యంలో విజయనిర్మల ఈ కార్యక్రమానికి రావడం సర్ప్రైజే. మున్ముందు మరింత మంది సీనియర్ ఆర్టిస్టుల్ని రప్పించాలని చూస్తోంది మంచు లక్ష్మి. అభాగ్యుల్ని ఆదుకోవడం కోసం మంచు లక్ష్మి.. జెమిని టీవీ సహకారంతో చేపడుతున్న ఈ ప్రోగ్రాంకు మంచి స్పందన వస్తోంది. సెలబ్రెటీలు చాలామంది ఈ కార్యక్రమంలో పాల్గొని ఎంతో మందికి సాయం చేశారు. ఈ మధ్యే సాయిధరమ్ తేజ్ అతిథిగా హాజరైన ప్రోగ్రాం ద్వారా రూ.20 లక్షలు సమకూరడం విశేషం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News