దశాబ్దానికి పైగా టాలీవుడ్లో నెంబర్ వన్ హీరోయిన్‌గా హవా నడిపించింది విజయశాంతి. హీరోయిన్ గా కెరీర్ ముగిసిపోయాక లేడీ ఓరియెంటెడ్ సినిమాలతోనూ తన ప్రత్యేకతను చాటుకుంది. ఆమె లీడ్ రోల్ చేసిన ‘ఒసేయ్ రాములమ్మ’ ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ సినిమాతోనే ఆమె లేడీ అమితాబ్ అనే పేరు తెచ్చుకుంది విజయశాంతి. ఆ తర్వాత అదే తరహా సినిమాలు చాలా చేసింది విజయశాంతి. ఐతే రాను రాను ఆమె క్రేజ్ అంతకంతకూ తగ్గిపోవడం.. రాజకీయాల్లో బిజీ అయిపోవడంతో సినిమాలు వదిలేసింది.
గత కొంత కాలం నుంచి ఆమె రాజకీయాల్లోనూ ఖాళీ అయిపోవడంతో సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వడం గురించి చర్చ జరుగుతోంది. ఓ దశలో చిరు రీఎంట్రీ మూవీ ‘ఖైదీ నెంబర్ 150’లోనూ విజయశాంతి నటిస్తుందన్న ప్రచారం జరిగింది. కానీ అవేవీ నిజం కాలేదు. ఐతే ఇప్పుడు విజయశాంతి ప్రధాన పాత్రలో ఓ భారీ లేడీ ఓరియెంటెడ్ మూవీ తెరకెక్కనున్నట్లు సమాచారం. తెలుగు.. తమిళం.. మలయాళం.. హిందీ భాషల్లో ఒకేసారి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తారట. ఇది ఒక చారిత్రక నేపథ్యం ఉన్న కథ అని సమాచారం. ఈ సినిమాకు విజయశాంతి నిర్మాణ భాగస్వామిగా కూడా ఉంటారట. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని.. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి ప్రకటన వస్తుందని సమాచారం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/