ఒక వైపున విజయ్ దేవరకొండ అభిమానులు .. మరో వైపున పూరి సినిమాలను ఇష్టపడేవారు 'లైగర్' సినిమా కోసం వేయికళ్లతో వెయిట్ చేస్తున్నారు. బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో బాక్సర్ గా విజయ్ దేవరకొండ కనిపించనున్నాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 25వ తేదీన ప్రేక్షకులను పలకరించడానికి ఈ సినిమా రెడీ అవుతోంది. ఈ సినిమా టీమ్ ప్రమోషన్స్ తో సందడి చేస్తోంది. తాజాగా ఈ సినిమా టీమ్ ను సుమ ఇంటర్వ్యూ చేసింది. పూరి .. చార్మీ .. విజయ్ దేవరకొండ .. అనన్య పాండే .. విషు ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
విజయ్ దేవరకొండ మాట్లాడుతూ .. "ఈ సినిమా ప్రమోషన్స్ ను హైదరాబాదులో ట్రైలర్ లాంచ్ తో మొదలుపెట్టాము. ఆ రోజున మాస్ హిస్టీరియా అంటే ఎలా ఉంటుందో చూశాము. అలాంటిది వేరే ఊరికి వెళ్లి అక్కడ పరిస్థితి డల్ గా ఉంటే ఎట్లా ప్రమోట్ చేయాలా అనే ఒక భయం ఉండేది.
నేను నిన్నమొన్నటి వరకూ హైదరాబాద్ దాటేసి బయటికి పోలేదు. మొన్నీమధ్యనే ముంబై ఒకసారి వెళ్లొచ్చాను. మళ్లీ ఈ సినిమా ప్రమోషన్స్ కోసమే అక్కడికి వెళ్లాము. ముంబైలో మాల్ కి వెళ్లగానే అక్కడి జనాన్ని చూసి షాక్ అయ్యాను.
ముంబైలో షాపింగ్ చేసుకుంటున్న వాళ్లను పిలిచిమరీ మనం మన సినిమా ఫలానా రోజున రిలీజ్ అవుతుందని చెప్పాలేమో అని అంతకుముందే నేను చార్మీ గారితో అన్నాను. కానీ అక్కడ జనాలకు ప్లేస్ సరిపోలేదు. మేము అనుకున్నదానికంటే మూడింతలు ఎక్కువగా వచ్చేశారు. అసలు యాక్టర్ ను అవుతానో లేదోనని అనుకున్న నేను, అంతమంది రావడం చూసి నమ్మలేకపోయాను. జనాన్ని చూడగానే లోపలి నుంచి ఒక ఫీలింగ్ వస్తుంది .. అప్పుడు ఇక మాట్లాడేస్తాను.
ప్రమోషన్స్ కోసం ఎక్కడికి వెళ్లినా పూర్తి చేయలేకపోతున్నాము .. అంతగా జనాలు వస్తున్నారు. స్టేజ్ పై ఇలా చేయాలని ముందుగా అనుకుంటాము. ఆడియన్స్ బాగా వస్తే స్టేజ్ పై చిన్న స్టెప్ వేయండి అంటారు .. నిజానికి స్టేజ్ పై డాన్స్ చేయడం నాకు ఇష్టం ఉండదు.
జనాలు బాగా రావడంతో నేను కాసేపు మాట్లాడదామని అనుకుంటే హాయ్ చెప్పేసి .. బాయ్ చెప్పేసి రమ్మంటారు. అలా ఈవెంట్స్ కేన్సిల్ అయినప్పుడు డాన్స్ చేసే బాధ తప్పినందుకు హ్యాపీగానే ఉంటుంది. కాకపోతే ఇంత చూసిన తరువాత కూడా నా ఈవెంట్ కి జనాలు వస్తారా లేదా అనే ఒక టెన్షన్ మాత్రం ఉంటుంది" అంటూ చెప్పుకొచ్చాడు.
Full View