వీరనారి ఝాన్సీలక్ష్మి బాయ్ కథ ఆధారంగా రూపొందిన మణికర్ణిక విడుదలయ్యాక జరుగుతున్న రచ్చ రోజురోజుకి జాతీయ మీడియా ప్రమేయంతో అంతకంతా ముదురుతోంది. తాను తీసిందే కంగనా రౌనత్ తిప్పి తీసిందని క్రిష్ ఒకవైపు ఎవరు తీస్తే ఏంటి వదిలేయండి అంటూ ఆవిడ సోదరి రంగోలి మరోవైపు ఎవరి వర్షన్లు వాళ్ళు చెప్పుకుంటూనే ఉన్నారు. నిజానికి మణికర్ణిక ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ దక్కించుకొనప్పటికి ఇప్పుడు వివాదాన్ని రేపుతున్న వాళ్ళందరూ దీన్ని బ్లాక్ బస్టర్ గా చెప్పుకోవడం విశేషం.
తాజాగా మణికర్ణిక కథకులు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కర్ర విరక్కుండా పాము చావకుండా సామెత తరహాలో స్పందించే ప్రయత్నం చేసారు. తాను ఎప్పుడూ బౌతికంగా సెట్స్ లో లేనని క్రిష్ కాని కంగనా కాని ఇద్దరూ తమకు ఏం కావాలో కోరితే అది అందించానే తప్ప అంతకు మించి సినిమా నిర్మాణంలో తన ప్రమేయంలో లేదని తేల్చేసారు. కొందరు దర్శకులు స్క్రిప్ట్ తో పాటు తమకు కావాల్సింది తీసుకుంటారని మరికొందరు దాన్ని తమ ఆలోచనలతో కొత్త స్థాయికి తీసుకు వెళ్తారని ఈ విషయంలో కంగనా క్రిష్ లు ఇద్దరూ తమ బాధ్యతలకు న్యాయం చేసారని కితాబు ఇచ్చేసారు. సక్సెస్ అయ్యారు కాబట్టి ఆ విషయాన్ని వదిలేసి విజయాన్ని ఆస్వాదించమని కోరారు.
కంగనా తీరు గురించే సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ విజయేంద్ర ప్రసాద్ చాలా తెలివిగా డిఫెన్స్ కామెంట్స్ చేయడం గమనార్హం. విడుదలకు ముందు కంగనా అగ్ర దర్శకులకు ఏ మాత్రం తీసిపోని రీతిలో డైరెక్షన్ చేసిందని మెచ్చుకున్న ఈయన ఇప్పుడు రిలీజయ్యాక షేర్ ఇద్దరికీ పంచడం విశేషం. వీటి సంగతి అలా ఉంచితే కనీసం 100 కోట్లు రాబడితేనే సేఫ్ అయ్యే ఛాన్స్ ఉన్న మణికర్ణిక అంత వసూలు చేయడం కష్టమే అని ట్రేడ్ రిపోర్ట్