ట్రైల‌ర్ కోస‌మే వంద‌ల కోట్లు ఖ‌ర్చు పెట్టారు

Update: 2017-04-28 05:55 GMT
సినిమా చూసేందుక జ‌నాలు టికెట్లు కొనటం మామూలే. కానీ.. ట్రైల‌ర్ చూసేందుకు వంద‌ల కోట్లు జ‌నాలు ఖ‌ర్చు పెట్టిన సినిమా ఉంటుందా? అంటే.. ఉండ‌నే ఉండ‌ద‌ని చెప్పేస్తాం. కానీ.. అలా చూసేసిన సినిమా ఉంద‌ని చెబుతున్నారు బాహుబ‌లికి క‌థ‌ను స‌మ‌కూర్చిన విజ‌యేంద్ర‌ప్ర‌సాద్‌. ప్ర‌ఖ్యాత ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి తండ్రిగా సుప‌రిచితులైన ఆయ‌న‌.. బాహుబ‌లి లాంటి అద్భుత‌మైన క‌థ‌కు ప్రాణం పోశార‌ని చెప్పాలి. ఏళ్ల త‌ర‌బ‌డి ఊరించిన రెండో భాగం విడుద‌లైన సంద‌ర్భంగా ఒక మీడియా ఛాన‌ల్ తో ప్ర‌త్యేకంగా మాట్లాడారు విజ‌యేంద్ర‌ప్ర‌సాద్‌.

ఈ సంద‌ర్భంగా ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాన్ని వెల్ల‌డించారాయ‌న‌. ఎక్క‌డైనా సినిమాకు డ‌బ్బులు ఖ‌ర్చు పెడ‌తార‌ని.. కానీ.. బాహుబ‌లి ఫ‌స్ట్ హాప్ అనే ట్రైల‌ర్ కు జ‌నాలు డ‌బ్బులు పెట్టి చూశార‌న్నారు.

ఏదైనా సినిమా ట్రైల‌ర్‌ కు.. నిర్మాత డ‌బ్బులు ఖ‌ర్చు చేసి.. ప్ర‌చారం చేస్తార‌ని.. కానీ.. బాహుబ‌లి 2కి రెండున్న‌ర గంట‌ల ట్రైల‌ర్ ను ప్ర‌జ‌లు విశేషంగా ఆద‌రించార‌ని.. కోట్లాది రూపాయిల్ని ఖ‌ర్చు చేశార‌ని.. ఒక ట్రైల‌ర్‌ కు వంద‌ల కోట్ల క‌లెక్ష‌న్లు రావ‌టం ఒక రికార్డుగా ఆయ‌న వ్యాఖ్యానించ‌టం విశేషం. రెండో భాగ‌మే అస‌లైన క‌థ అని.. అందులోని క్యారెక్ట‌ర్ల‌ను ప‌రిచ‌యం చేయ‌టానికి  మొద‌టి భాగ‌మ‌న్నారు. ఏమైనా.. ట్రైల‌ర్ కోసం వంద‌ల కోట్లు ఖ‌ర్చు చేయ‌టం ఒక రికార్డుగా అభివ‌ర్ణించారు విజ‌యేంద్ర‌ప్ర‌సాద్‌.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News