ఝాన్సి రాణి లక్ష్మీబాయి జీవితం ఆధారంగా తెరకెక్కిన 'మణికర్ణిక' రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల కానుంది. కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి రచయిత కేవీ విజయేంద్ర ప్రసాద్. మొదట ఈ సినిమాకు దర్శకుడు క్రిష్ అయినప్పటికీ కొంతభాగం షూట్ పెండింగ్ ఉన్న సమయంలో సినిమానుండి తప్పుకున్నాడు. మిగతా భాగాన్ని దర్శకత్వ భాద్యతలు చేపట్టి కంగనా పూర్తి చేసింది. క్రిష్ తప్పుకోవడం దగ్గర నుండి మొదలుపెడితే ఈ సినిమా చూట్టూ చాలా వివాదాలు ముసురుకున్నాయి. ఈ విషయాలపై రీసెంట్ గా విజయేంద్ర ప్రసాద్ స్పందించారు.
'మణికర్ణిక' కు సంబంధించి అసలు వివాదాలేమీ లేవని అయన తోసిపుచ్చారు. క్రిష్ ఈ సినిమానుండి తప్పుకోవాల్సి వచ్చింది కదా అని అడిగితే.. అదేమీ లేదని సినిమానుండి తప్పుకోవడం క్రిష్ నిర్ణయమేనని వివరించారు. 'మణికర్ణిక' ముందు అనుకున్నదానికంటే డిలే కావడం.. క్రిష్ కు బాలకృష్ణ సినిమాకు కమిట్ కావడంతో తప్పుకున్నాడని వివరించారు. క్రిష్ తప్పుకున్న తర్వాత కీలకమైన యూనిట్ సభ్యులు అందరూ దర్శకత్వ భాద్యతలు కంగనాకు ఇచ్చేందుకు మొగ్గుచూపారని అన్నారు. మెజారిటీ భాగం పూర్తయిన సినిమాను టేకప్ చేసేందుకు సీనియర్ దర్శకులు ఎవరూ ముందుకు రారని అందుకే కంగనా ఆ బాధ్యతలు చేపట్టిందని అన్నారు.
కంగన భాద్యతలు చేపట్టినప్పుడు 15 రోజుల షూట్ మాత్రమే ఉందని.. కానీ కంగన కొన్ని ఎక్స్ట్రా షాట్స్ సూచించిందని.. అవి తమకు కూడా నచ్చడంతో అవి కూడా షూట్ చేశామని తెలిపాడు. అవుట్ పుట్ చూసినప్పుడు క్రిష్.. కంగన ఇద్దరిలో ఎవరు ఏ సీన్స్ తెరకెక్కించారో కనుక్కోలేకపోయనని తెలిపారు. క్రిష్.. కంగనాల మధ్య గొడవ ఉందా అని అడిగితే తనకు తెలిసినంతవరకూ అలాంటిదేమీ లేదని క్లారిటీ ఇచ్చాడు.