చిరూ.. ఆయన సెటైర్ అర్థమైందా?

Update: 2015-09-12 11:30 GMT
ఏళ్లకు ఏళ్లు గడిచిపోతున్నాయి. హీరోగా మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ సినిమా సంగతేంటో తేలట్లేదు. పూరి జగన్నాథ్ తో అనుకున్న సినిమా దాదాపుగా పక్కకు వెళ్లిపోయినట్లే కనిపిస్తోంది. మొన్నామధ్య ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ ఆడియో ఫంక్షన్ లో చిరు రచయితలు, దర్శకులందరికీ ఓపెన్ ఆఫర్ ఇచ్చేశారు.. మంచి కథతో రండి అవకాశం అందుకోండి అని. అయినా ఎక్కడా చడీచప్పుడు లేదు. ఏడాదికి వందకు పైగా సినిమాలు తెరకెక్కే తెలుగు పరిశ్రమలో మెగాస్టార్ కోసం ఇంత కాలంలో ఒక కథ రెడీ చేయలేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ప్రస్తుతానికి చిరంజీవికి ఎవరెవరు కథలు రెడీ చేస్తున్నారన్న సంగతి తెలియట్లేదు. ఐతే ఈ మధ్య విజయేంద్ర ప్రసాద్ చిరు కోసం కథ సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వినిపించాయి. బాహుబలి - భజరంగి భాయిజాన్ లాంటి బ్లాక్ బస్టర్ లకు కథ అందించి ఊపు మీదున్న విజయేంద్రుడు బరిలోకి  దిగుతున్నాడంటే చిరుకు ఇక ఢోకా లేనట్లే అని మెగా అభిమానులు సంతోషించారు.

కానీ వాస్తవం ఏంటంటే విజయేంద్ర  ప్రసాద్ చిరుకు కథ తయారు చేయట్లేదు. ఒకవేళ తనను అడిగినా కథ రాయలేనని కరాఖండిగా చెప్పేశారాయన. దీనికి కారణాలు చెబుతూ.. చిరంజీవి సినిమాకు కథ అంటేట 3 బాహుబలి లాంటి సినిమాలకు, 3 భజరంగి భాయిజాన్ లాంటి సినిమాలకు దీటైనది కావాలని.. చిరంజీవికి ఉన్న అసంఖ్యాకమైన అభిమానుల్ని, వారి ఆకాంక్షల్ని దృష్టిలో ఉంచుకుని రాయాల్సి ఉంటుందని, అది చాలా కష్టమైన విషయమైని చెప్పేశారు విజయేంద్ర ప్రసాద్. ఐతే ఆయన మాటల్ని బట్టి చూస్తుంటే.. చిరంజీవి అండ్ కో కథ విషయంలో మరీ అతిగా ఆశిస్తున్నారని  పరోక్షంగా సెటైర్ వేస్తున్న సంగతి అర్థమైపోతుంది.

ప్రస్తుత ట్రెండుకు తగ్గట్లు ఎంటర్ టైన్ మెంట్ ఉండాలి.. ఫ్యామిలీ ఆడియన్స్ కోసం కొంచెం సెంటిమెంట్ టచ్ కూడా ఉంటే బెటర్.. అలాగని యూత్ ఆడియన్స్ దూరం కాకూడదు.. తన పొలిటికల్ ఇమేజికి తగ్గట్లు సందేశం ఉండాలి..  అభిమానులకు నచ్చేలా డ్యాన్సులు - ఫైట్లు ఉంటే బెటర్.. ఇలా సవాలక్ష కండిషన్లున్నాయి చిరు సినిమా విషయంలో. ఏ రచయితకైనా అయినా - దర్శకుడికైనా ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఆకర్షణీయమైన కథ రెడీ చేయడమంటే సవాలు అవుతోంది. ఇలాంటి తూకాలేమీ వేసుకోకుండా.. మరీ అద్భుతాలు ఆశించకుండా.. సింపుల్ గా ఏదో ఒక కథతో ముందుకెళ్లిపోతే బావుంటుందన్నది చాలామంది అభిప్రాయం. విజయేంద్ర ప్రసాద్ మాటల్లో అంతరార్థం కూడా అదే.
Tags:    

Similar News