మెగా-నందమూరి కథను వండుతున్నారు

Update: 2017-11-22 08:00 GMT
ఈ మధ్య రూమర్స్ అదృష్టం ఏమిటో గాని చాలా వరకు నిజాలే అవుతున్నాయి. సెలబ్రెటీల గురించి ఒక్క ఫొటో బయటకు వచ్చినా ఊహాగానాలు అందరిలో మొదలై అసలు సాక్ష్యాలు ఒక్కొక్కటిగా  బయటపడుతున్నాయి. రీసెంట్ గా ఇదే తరహాలో ఒక భారీ మల్టీస్టారర్ సినిమా రూమర్ కూడా ఫైనల్ గా నిజమయ్యేలా ఉంది. టాలీవుడ్ లో అన్ని తరహా సినిమాలు వచ్చాయి. కానీ స్టార్ హీరోల సినిమాలు ఇంత వరకు రాలేవు.

అయితే ఫైనల్ గా ఆ కళ నిజమవ్వబోతోంది. దర్శదీరుడు రాజమౌళి కూడా ఆ సినిమాను తెరకెక్కిస్తుండడం స్పెషల్ అని చెప్పాలి. రీసెంట్ గా జక్కన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో అలాగే నందమూరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి ఒక ఫొటోకు స్టీల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే జక్కన్న వీరిద్దరి కోసం ఒక మంచి కథను రెడీ చెయ్యమని తండ్రి విజయేంద్ర ప్రసాద్ తో చర్చలు జరుపుతున్నాడట. సాధారణంగా ఇద్దరు స్టార్ హీరోలు ఒకే కథలో సమానంగా చూపించాలి అంటే చాలా కష్టంతో కూడుకున్న పని.

కానీ రచయిత విజయేంద్ర ప్రసాద్ కి ఉన్న అనుభవంతో కథను రాయగలరని అందరు అనుకుంటున్నారు. ఇక జక్కన్న గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాలో ప్రతి పాత్రను హైలెట్ గా చూపించాలని చూస్తాడు. ఇక ఇద్దరి హీరోలు ఉంటే జక్కన్న ఇంకా ఏ స్థాయిలో చూపిస్తాడో అర్థం చేసుకోవచ్చు.  ఈ ప్రతిష్టాత్మక చిత్రం షూటింగ్ 2018 సమ్మర్ లో స్టార్ అవ్వనుందని సమాచారం. ఇక సినిమాను డివివి దానయ్య నిర్మించడానికి రెడీగా ఉన్నారు.
Tags:    

Similar News