ప్రపంచం మెచ్చిన బాహుబలి లాంటి చిత్రానికి కథ అందించిన గొప్ప రైటర్ విజయేంద్ర ప్రసాద్. ఒక్క బాహుబలి అనే కాదు.. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలకు ఆయన కథ అందించారు. దర్శక ధీరుడు రాజమౌళి కూడా తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ రాసిన స్టోరీలతోనే వరస హిట్లు కొడుతూ టాప్ డైరెక్టర్ స్థాయికి చేరాడు.
విజయేంద్ర ప్రసాద్ తెలుగులోనే కాదు.. హిందీ సినిమాలకు సైతం కథలు అందించారు. ఇటీవల కాలంలో సల్మాన్ ఖాన్ సూపర్ హిట్ మూవీ భజరంగీ భాయీజాన్ కథ విజయేంద్ర ప్రసాద్ దే. ఆయన ఇప్పుడు ఓ టీవీ సీరియల్ కు కథ రాస్తున్నారనేది టాలీవుడ్ లో వినిపిస్తున్న లేటెస్ట్ టాక్. జీ తెలుగులో వచ్చే సీరియల్ కోసం ఆయన స్క్రిప్ట్ అందించనున్నారు. విజయేంద్ర ప్రసాద్ లాంటి టాప్ రైటర్ బుల్లితెరకు పనిచేయడం అన్నది అత్యంత అరుదనే చెప్పాలి.
అయితే ఈ సీరియల్ ను ఒక్క తెలుగులోనే కాకుండే వేరే భాషల్లో డబ్ చేస్తామని జీ తెలుగు ఆఫర్ చేసిందట. తన స్క్రిప్ట్ ఎక్కువ మంది ప్రేక్షకులకు రీచ్ అవుతుందనే ఉద్దేశంతో ఆయన ఈ ఆఫర్ కు ఓకే అన్నాడని తెలుస్తోంది. అదీగాక నార్త్ లో విజయేంద్ర ప్రసాద్ కు మంచి గుర్తింపే ఉంది. ఇది తమ సీరియల్ కు ప్లస్ అవుతోందని జీ యాజమాన్యం భావిస్తోందట. సో.. విజయేంద్ర ప్రసాద్ పెన్ పవర్ ను బుల్లితెరపై చూసేయొచ్చన్న మాట.