క్రిష్ కోసం బాహుబలి రైటర్ కథ!!

Update: 2017-04-12 13:31 GMT
కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ కు ఇప్పటికే దేశవ్యాప్తంగా క్రేజ్ ఉంది. టాలీవుడ్ లో బాహుబలి.. బాలీవుడ్ లో సుల్తాన్ అంటూ వరుస విజయాలు సాధించిన ఈయనపై.. హిందీ స్టార్స్ కు.. మేకర్స్ బాగానే గురి కుదిరింది.

రాణీ ఝాన్సీ లక్ష్మీ బాయ్ పై మూవీ తీయాలన్నది కంగనా రనౌత్ కల.. కోరిక. కేతన్ మెహతా దర్శకత్వంలో మూవీ లాంఛింగ్ కూడా జరిగిపోయింది. అయితే.. అతని పనితీరుపై సంతృప్తి చెందకపోడంతో .. కేతన్ ను తప్పించింది కంగనా. ఆ తర్వాత కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ కు స్టోరీ బాధ్యతలు కంగన అప్పగించగా.. తన స్టైల్ లో ఈ కథను రీరైట్ చేసేశాడాయన. అలాగే దర్శకుడిగా క్రిష్ పేరును కూడా సూచించాడు. గతంలో కొన్ని బాలీవుడ్ సినిమాలకు కథ.. కథా సహకారం అందించిన క్రిష్.. ఇప్పుడు విజయేంద్ర ప్రసాద్ రచనకు దర్శకత్వం వహించనున్నాడన్న మాట.

ఈ చిత్రానికి స్టోరీ స్క్రీన్ ప్లే విజయేంద్ర ప్రసాద్ అందించనుండగా.. హిందీ డైలాగ్స్ ను అక్కడి బడా రచయిలతో రాయించనున్నారు. కంగనతో రాణీ లక్ష్మీ బాయ్ మూవీ చేస్తున్నందుకు క్రిష్ కు బాగానే ముడుతోందని తెలుస్తోంది. మంచి పారితోషికంతో పాటు.. ఈ చిత్రానికి సంబంధించి తెలుగు హక్కులు కూడా క్రిష్ కే దక్కాయట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News