దళ‌ప‌తి తెలుగులో ఫ్లాప్ కానీ..!

Update: 2019-10-29 07:20 GMT
150 కోట్లు.. 250 కోట్ల ఫుల్ ర‌న్.. అంటూ లెక్క‌లు తేల్చేస్తున్నారు తంబీలు. బాక్సాఫీస్ వ‌ద్ద ఇల‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్ జోరు మ‌రోసారి కొన‌సాగింద‌ని త‌మిళ‌నాట ప్ర‌చార‌మ‌వుతోంది. విజ‌య్ న‌టించిన తాజా చిత్రం బిగిల్ త‌మిళ బాక్సాఫీస్ వ‌ద్ద 150కోట్ల గ్రాస్ వ‌సూలు చేసిందిట‌. తేరి-మెర్స‌ల్- స‌ర్కార్ త‌ర్వాత ఈ ఫీట్ వేసిన నాలుగో చిత్రం ఇది అంటూ ప్ర‌చార‌మ‌వుతోంది.

అయితే త‌మిళ‌నాట ప‌వ‌ర్ స్టార్ గా పాపులారిటీ ఉన్న విజ‌య్ కి యావ‌రేజ్ అన్నా వ‌సూళ్లు ఆ స్థాయిలోనే ఉంటున్నాయి. కానీ తెలుగులో స‌న్నివేశమే మ‌రోలా ఉంది. ఇక్క‌డ క‌లెక్ష‌న్స్ విష‌యంలో ర‌క‌ర‌కాల లెక్క‌లు చెబుతున్నా వాస్త‌వికంగా లెక్క‌లు వేరుగా ఉన్నాయ‌న్న విశ్లేష‌ణ సాగుతోంది. తెలుగులో విజిల్ వ‌సూళ్ల ప‌రంగా ఫ్లాప్ అన్న టాక్ మార్కెట్ వ‌ర్గాల్లో వినిపించింది. కేవ‌లం నాలుగు రోజుల్లో వ‌సూళ్లు ఇవీ అంటూ లెక్క‌ల్లో ప్ర‌చారార్భాటం మాత్రం క‌నిపిస్తోంది. అయితే వాస్త‌వ స‌న్నివేశ‌మే వేరుగా ఉంది.

8 కోట్లు 10కోట్లు అంటూ ప్రీబిజినెస్ లెక్క‌లు ఊద‌ర‌గొట్టిన‌ట్టే ఇంత వ‌సూలైంది అంత వ‌సూలైంది అన్న ప్ర‌చారం హోరెత్తుతోంది. ఇక బిగిల్ చిత్రం ప్ర‌పంచ‌వ్యాప్తంగా 250కోట్లు ఫుల్ ర‌న్ లో వ‌సూలు చేసేస్తుంద‌ని అడ్వాన్స్ డ్ గా ప్ర‌చారం సాగుతోంది. వాస్త‌వంగా త‌మిళ‌నాడులో ఉన్న ఊపు ఇరుగు పొరుగు ప‌రిశ్ర‌మ‌ల్లో లేదు. ఓవ‌ర్సీస్ ఫ‌ర్వాలేద‌నిపించింది. అయితే బిగిల్ (విజిల్) పంపిణీదారుల కోణంలో చూస్తే.. గ్రాస్ లెక్క‌ల‌తో సంబంధం లేకుండా షేర్ ఎంత వ‌సూలైంది? అన్న‌ది ప‌క్కాగా తేలాల్సి ఉంటుంది.
Tags:    

Similar News