విక్రమ్ కూతురికి పెళ్లియిపోతోంది

Update: 2016-06-27 09:24 GMT
హీరో విక్రమ్ గురించి పెద్దగా తెలియని వాళ్లకు అతణ్ని చూపించి.. వయసెంతో చెప్పమంటే 30-35 మధ్య ఉండొచ్చని అంటారేమో. కానీ అతడి వయసు 50 ఏళ్లు. అతడికి 20 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న కొడుకు.. కూతురు ఉన్నారు. అందులోనూ అమ్మాయికి పెళ్లీడు కూడా వచ్చేసింది. పెళ్లి కూడా కుదిరిపోయింది. జులైలో నిశ్చితార్థం కూడా చేసేస్తున్నాడు విక్రమ్.

విక్రమ్ కూతురి పేరు అక్షిత. చదువు పూర్తి చేసిన ఆమె మను రంగనాథన్ అనే కుర్రాడితో ప్రేమలో పడింది. అతను చెన్నైలో బాగా ఫేమస్ అయిన కేర్ బేకరీ యజమాని కొడుకు. కూతురి ప్రేమను కాదనుకుండా ఆమె ఇష్టప్రకారమే పెళ్లి చేస్తున్నాడు విక్రమ్. జులై 10న అక్షిత-మనుల నిశ్చితార్థం జరగనుంది. పెళ్లి వచ్చే ఏడాది జరుగుతుందని సమాచారం. నిశ్చితార్థం చాలా సింపుల్ గా చేసేయబోతున్నారు.

విక్రమ్ భార్య పేరు శైలజ బాలకృష్ణన్. ఆమెది కేరళ. విక్రమ్ ఇంకా సినిమాల్లో సరిగా స్థిరపడకముందే ఆమెతో ప్రేమలో పడ్డాడు. ఇద్దరూ కలిసి కేరళలోని గురువాయూర్ లో చాలామంది జంటలతో కలిసి సింపుల్ గా పెళ్లి చేసుకున్నారు. శైలజ చెన్నైలోని ఓ స్కూల్లో సైకాలజీ టీజర్ గా పని చేస్తోంది. విక్రమ్ కొడుకు ధ్రువ్.. తండ్రి బాటలో సినిమాల్లోకి రావాలని కోరుకుంటున్నాడు. ఆ దిశగా శిక్షణ కూడా తీసుకుంటున్నాడు. విక్రమ్ ప్రస్తుతం ఆనంద్ శంకర్ దర్శకత్వంలో ‘ఇరుముగన్’ అనే సినిమాలో నటిస్తున్నాడు.
Tags:    

Similar News