విక్రమ్ కుమార్.. తెలుగు ప్రేక్షకుల హృదయాల్ని తట్టి లేపిన దర్శకుడు. ముందు ‘ఇష్క్’తో సైలెంట్ హిట్ కొట్టి.. ఆ తర్వాత ‘మనం’తో మన ప్రేక్షకుల మనసులపై చెరగని ముద్ర వేశాడు విక్రమ్. ఇప్పుడు ‘24’ లాంటి మరో వైవిధ్యమైన సినిమాతో రాబోతున్నాడు. ఐతే తన కెరీర్ ఆరంభంలో చేసిన ఓ సినిమా గురించి ఇప్పుడు తెగ బాధపడుతున్నాడు విక్రమ్. ఆ సినిమా పేరు.. అలై. తెలుగులో ‘ఇష్టం’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన విక్రమ్ కు ఇది రెండో సినిమా. 2003లో తమిళంలో శింబు-త్రిష హీరో హీరోయిన్లుగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడతను. ఐతే ఆ సినిమా దారుణమైన ఫలితాన్ని చవిచూసింది. విక్రమ్ మీద విమర్శకులు విరుచుకుపడ్డారు.
అప్పట్లో ఎలా విక్రమ్ ఫీలింగ్ ఏంటో కానీ.. ఇప్పుడు మాత్రం తాను అలాంటి సినిమా తీయాల్సింది కాదని.. అదో చెత్త సినిమా అని విక్రమ్ చెబుతున్నాడు. ఆ సినిమా స్క్రీన్ ప్లే కూడా పూర్ అని విక్రమ్ అభిప్రాయపడ్డాడు. ఐతే ‘అలై’ సినిమా తనకెన్నో పాఠాలు నేర్పిందని.. సినిమా ఎలా తీయకూడదో ఆ తర్వాత అర్థమైందని విక్రమ్ చెప్పాడు. నిజంగానే తాను చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకున్న విక్రమ్.. ఆ తర్వాత తన రెండు సినిమాలకు భిన్నంగా హార్రర్ జోనర్ ఎంచుకుని ‘13బి’ సినిమా చేశాడు. అది సెన్సేషనల్ హిట్టయింది. ఆపై మళ్లీ గ్యాప్ తీసుకుని తెలుగులో వరుస ఫ్లాపులతో కొట్టుమిట్టాడుతున్న నితిన్ హీరోగా ‘ఇష్క్’ చేశాడు. అది సూపర్ హిట్టయింది. ఇక ‘మనం’ సంగతి చెప్పాల్సిన పని లేదు.