కొన్ని సినిమాల ఫలితమేంటో తెలుసుకోవడానికి కొన్ని రోజుల వరకు ఎదురు చూడాల్సిన పని లేదు. విడులైన తొలి రోజే తొలి షోకే అర్థమైపోతుంది. తమిళ - తెలుగు భాషల్లో శుక్రవారం విడుదలైన ‘సామి’ నే ఈ కోవలోని సినిమానే. దీని జాతకమేంటో మార్నింగ్ షోతోనే అర్థమైపోయింది. రెండు భాషల్లోనూ ఈ చిత్రానికి నెగెటివ్ టాక్ వచ్చింది. క్రిటిక్స్ అందరూ దీనికి లో రేటింగ్ ఇచ్చారు. రెండు భాషల్లోనూ మాస్ సినిమాలు కరవైపోయాయి కాబట్టి ఈ చిత్రంపై ఆ వర్గం ప్రేక్షకులు బాగానే ఆసక్తి చూపించారు. దీంతో ఓపెనింగ్స్ పర్వాలేదనిపిస్తున్నాయి. కానీ సినిమా నిలబడే పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఇప్పుడు ప్రేక్షకుల అభిరుచి మారి.. కొత్తదనం కోసం చూస్తున్న రోజులివి. ఇలాంటి టైంలో హరి రొడ్డకొట్టుడు కథతో ఈ చిత్రాన్ని రూపొందించాడు.
తమిళంలో దశాబ్దంన్నర కిందట విక్రమ్-హరి కాంబినేషన్లో బ్లాక్ బస్టర్ అయిన ‘సామి’కి సీక్వెల్ గా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఆ సినిమాను దృష్టిలో ఉంచుకుని సీక్వెల్ చూస్తే జనాలకు చిరాకొస్తోంది. ‘సామి’కి దరిదాపుల్లో లేదీ చిత్రం. ఈ సీక్వెల్ విషయంలో హరి అంత సిన్సియర్‌గా ఏమీ లేడు. నిజానికి ఈ చిత్ర కథ ‘సింగం’ సిరీస్ లో నాలుగో భాగం కోసం అనుకున్నది. ఐతే ‘సింగం-3’ ఫ్లాప్ కావడంతో సూర్య నాలుగో భాగం చేయడానికి అంగీకరించలేదు. ఐతే ఆల్రెడీ రాసుకున్న స్క్రిప్టు వృథా కాకూడదని భావించి హరి.. దాన్ని ‘సామి’ సీక్వెల్ గా మార్చేశాడు. రెంటికి చిన్న లింక్ కలిపి.. ఆ తర్వాత మిగతాదంతా మామూలుగానే నడిపించేశాడు. అసలు హరి పోలీస్ స్టోరీలన్నీ కూడా దాదాపుగా ఒకేలా ఉంటాయి. ఐతే ఇంతకుముందు అతడి సినిమాల్లో ఉన్న ఊపు ఇప్పుడు లేదు. ‘సింగం-3’తోనే జనాలకు హరి పోలీస్ సినిమాల మీద మొనాటనీ ఫీలింగ్ వచ్చేసింది. ఇలాంటి టైంలో ‘సామి’ సీక్వెల్ తో అతను చేసిన హడావుడి పని చేయలేదు. మొత్తానికి సూర్య తప్పించుకుంటే.. విక్రమ్ ఈ చిత్రం ఒప్పుకుని బుక్ అయిపోయాడు. అసలే ఏళ్లకు ఏళ్లుగా హిట్ లేక అల్లాడిపోతున్న విక్రమ్ కు ‘సామి’తో మరో ఎదురు దెబ్బ తగిలింది.