తన వాలెంటైన్ ను పరిచయం చేసిన త్రిష
ఇలా పలు వివాదాలతో అమ్మడు వార్తల్లో నిలిచింది. గత కొన్నాళ్లుగా విజయ్ తో త్రిష రిలేషన్ లో ఉందని టాక్ నడుస్తున్న విషయం తెలిసిందే.
సౌత్ స్టార్ హీరోయిన్ త్రిష ఎప్పుడూ ఏదో విషయం పేరిట వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. అప్పట్లో ఎంగేజ్‌మెంట్ చేసుకుని, తర్వాత పెళ్లి క్యాన్సిల్ చేసుకోవడం, స్టార్ హీరోలతో రిలేషన్‌షిప్స్, ఇలా పలు వివాదాలతో అమ్మడు వార్తల్లో నిలిచింది. గత కొన్నాళ్లుగా విజయ్ తో త్రిష రిలేషన్ లో ఉందని టాక్ నడుస్తున్న విషయం తెలిసిందే.
అయితే విజయ్ తనకు అసలు నచ్చడని చెప్పి అందరి నోళ్లు మూయించిన త్రిష ప్రస్తుతం సింగిల్ గానే ఉంటుంది. రీసెంట్ గా వాలెంటైన్స్ డే సందర్భంగా త్రిష తన వాలెంటైన్ ను అందరికీ పరిచయం చేసింది. వాలెంటైన్ అనగానే అందరూ త్రిషకు లవర్ ఉన్నాడా అనుకోవచ్చు. త్రిష తనకు వాలెంటైన్ అని చెప్పి పరిచయం చేసింది తన పెంపుడు కుక్క ఇజ్జీని.
ఈ నెల 2న ఇజ్జీని త్రిష దత్తత తీసుకుందట. ఇజ్జీ తనను సేవ్ చేసిందని, లైఫ్ లోకి వెలుగు అవసరమనుకున్న టైమ్ లో తనకు ఇజ్జీని ఇచ్చినందుకు లోగేష్ బాలా థాంక్యూ, నా కోసం ఆ దేవుడు పంపిన బుజ్జి చిన్నారి, ఎప్పటికీ నువ్వే నా వాలెంటైన్ అంటూ త్రిష ఇజ్జీతో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ రాసుకొచ్చింది.
ఇక త్రిష కెరీర్ విషయానికి వస్తే ముందు సైడ్ క్యారెక్టర్లు చేసిన అమ్మడు వర్షం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైంది. మొదటి సినిమానే మంచి హిట్ కావడంతో ఆ తర్వాత త్రిష వరుస పెట్టి అవకాశాలందుకుంది. తర్వాత కొన్నేళ్ల పాటూ ఇండస్ట్రీకి గ్యాప్ ఇచ్చిన త్రిష 96 మూవీతో రీఎంట్రీ ఇచ్చింది.
తన కెరీర్లో కేవలం కమర్షియల్ సినిమాలే కాకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేసి త్రిష ఆడియన్స్ ను ఇంప్రెస్ చేసింది. ప్రస్తుతం అమ్మడు తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో కలిసి విశ్వంభర సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాతోనే త్రిష టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇవ్వనుంది. ఇవి కాకుండా పలు తమిళ సినిమాల్లో త్రిష నటిస్తోంది.