కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రండి: రకుల్
ఒకప్పుడు టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన రకుల్ ప్రీత్ సింగ్ స్టార్ హీరోలందరితో కలిసి సినిమాలు చేసింది.
ఒకప్పుడు టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన రకుల్ ప్రీత్ సింగ్ స్టార్ హీరోలందరితో కలిసి సినిమాలు చేసింది. కానీ గత కొంత కాలంగా రకుల్ కు ఆశించిన స్థాయిలో సినిమాలు రావడం లేదు. అమ్మడు చివరిగా ఇండియన్2 సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చింది. కానీ ఆ సినిమాలో పెద్దగా గుర్తింపు లేని పాత్ర చేసిన రకుల్ ఇప్పుడు తన భర్త నిర్మాణంలో బాలీవుడ్ లో ఓ సినిమా చేస్తోంది.
ప్రస్తుతం రకుల్ తన ఫోకస్ మొత్తం బాలీవుడ్ పైనే పెట్టింది. అమ్మడు ఇప్పుడు అజయ్ దేవగన్, మాధవన్ తో కలిసి దే దే ప్రాయ్ దే2 సినిమాలో నటిస్తోంది. దీంతో పాటూ తమిళంలో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కనున్న ఇండియన్3 లో కూడా నటించనుంది. రకుల్ కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గానే ఉంటుంది.
తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ తో పాటూ, వ్యక్తిగత అభిప్రాయాలను కూడా రకుల్ తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగానే రకుల్ తాజాగా తన ఇన్‌స్టాలో ఓ పోస్ట్ చేసింది. అందులో అలవాటైన పనుల నుంచి, ప్రాంతాల నుంచి బయటకు రమ్మని, కంఫర్ట్ గా ఉన్న ప్లేసే మీకెప్పుడూ శత్రువుగా మారుతుందని రాసి ఉన్న కోట్ ను పోస్ట్ చేసింది.
ప్రజలు సోమరితనంగా మారడానికి కారణం ఎప్పుడూ ఒకే ప్లేస్ లో ఉండటమని, దాని వల్ల సౌకర్యం ఎక్కువ అవుతుందని, ఎవరూ ఒక వర్క్ నుంచి మరో వర్క్ కు మారడం లేదని, రెగ్యులర్ గా అలవాటైన పనినే చేస్తున్నారని, వీటన్నింటినీ అలవాటు పడి ఏదైనా కావాలనుకున్నప్పుడు కూడా రేపు చూద్దాంలే అనుకుంటున్నారని, ఈ కారణాల చేతే చాలా మంది ఎదగడం లేదని రకుల్ షేర్ చేసిన కోటేషన్ లో ఉంది.
ఎవరైనా సరే జీవితంలో పైకి ఎదగాలంటే కఠినమైన విషయాల గురించి ఆలోచించాలని, వాటిని ఆచరణలో పెట్టాలని అప్పుడే సక్సెస్ అందుకుంటామని, అలవాటైన ప్రాంతం అందంగా ఉన్నప్పటికీ అది జీవితంలో పైకి ఎదగనీయదని రాసి ఉన్న కొటేషన్ ను రకుల్ షేర్ చేసింది. ఇక రకుల్ తన గురించి చెప్తూ తాను చాలా స్ట్రాంగ్ అని, తనను తాను ఎక్కువగా ప్రేమించుకుంటానని, ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని కోరుకుంటాననని రకుల్ తెలిపింది.