గోపీచంద్-సంకల్ప్ లకు నిర్మాత సెట్!
మ్యాచో స్టార్ గోపీచంద్ తో `ఘాజీ` ఫేం సంకల్ప్ రెడ్డి ఓ సినిమాకి చర్చలు జరుగుతున్నాయని ఇటీవల ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే.
మ్యాచో స్టార్ గోపీచంద్ తో `ఘాజీ` ఫేం సంకల్ప్ రెడ్డి ఓ సినిమాకి చర్చలు జరుగుతున్నాయని ఇటీవల ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అదే సమయంలో మళ్లీ గోపీ కోసం మాస్ డైరెక్టర్ సంపత్ నంది కూడా బరిలోకి దిగుతున్నాడని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో గోపీ ముందుగా ఎవరికి ఛాన్స్ ఇస్తాడు? అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. అయితే తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం గోపీ ఘాజీకే గ్రీన్ సిగ్నెల్ ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఇద్దరి మధ్య స్టోరీకి సంబంధించి డిస్కషన్స్ ముగింపు దశకు చేరుకున్నాయని... స్రిప్ట్ లాక్ అయినట్లేనని గోపీచంద్ సన్నిహితుల నుంచి లీకైంది. అలాగే ఈ చిత్రాన్ని నిర్మించడానికి శ్రీనివాస్ చుట్టూరి ముందుకొస్తున్నట్లు తెలుస్తోంది. తన సిల్వర్ స్క్రీన్ సంస్థపై నిర్మించాలని ప్లాన్ చేస్తున్నాడుట. దీంతో దాదాపు ఈ ప్రాజెక్ట్ లాక్ అయ్యే దిశగానే అడుగులు పడుతున్నట్లు కనిపిస్తోంది. సంకల్ప్ తో సినిమా అంటే? ఎలా ఉంటుందో ? చెప్పాల్సిన పనిలేదు.
రొటీన్ కమర్శియల్ సినిమాలు తీయడు. వాస్తవ సంఘటనల్ని ఆధారంగా చేసుకుని టెక్నికల్ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు తీయడం సంకల్ప్ ప్రత్యేకత. `ఘాజీ`, `అంతరిక్షం` సినిమాలతో వినూత్న దర్శకుడిగా గుర్తింపు దక్కిం చుకున్న సంగతి తెలిసిందే. తొలి సినిమా జాతీయ అవార్డు సైతం అందుకున్నాడు. బాలీవుడ్ లో `ఐబీ 71` చిత్రాన్ని తెరకెక్కించాడు. మరి ఇలాంటి ట్రాక్ రికార్డు కలిగిన సంకల్ప్ గోపీతో ఎలాంటి ప్రయోగం చేస్తాడో చూడాలి.
ఇప్పటి వరకూ గోపీచంద్ కేవలం కమర్శియల్ సినిమాలే చేసాడు. వైవిథ్యమైన సినిమాలు తీసింది లేదు. ఈ నేపథ్యంలో సంకల్ప్ తో గోపీ కలుస్తున్నాడనే వార్త ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది. మరి ఇద్దరు ఎలాంటి ప్రయోగతంతో ప్రేక్షకుల ముందుకొస్తారో చూడాలి.