అర్జున్ రెడ్డి' తమిళ రీమేక్ ను ధృవ్ విక్రమ్ హీరోగా బాలా దర్శకత్వంలో 'వర్మ' అనే పేరుతో తెరకెక్కించడం.. ఫైనల్ అవుట్ పుట్ సరిగా లేకపోవడంతో సినిమా మొత్తాన్ని స్క్రాప్ చేయడం తెలిసిందే. ఈ సినిమాను కొత్త టీమ్ తో 'ఆదిత్య వర్మ' టైటిల్ తో మళ్ళీ ఫ్రెష్ గా తెరకెక్కించడం మొదలు పెట్టారు. తెలుగు 'అర్జున్ రెడ్డి' సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన గిరీశయ్య ఈ రీమేక్ కు దర్శకుడు.
పెద్దగా హడావుడి లేకుండా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాగురించి రీసెంట్ గా ఒక అప్డేట్ వచ్చింది. ఈ సినిమా కొత్త షెడ్యూల్ పోర్చుగల్ దేశంలో జరుగుతోందని ఒక ఫోటో కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. అప్పటివరకూ షూటింగ్ విశేషాలే ఎవరికీ తెలియవు. తాజాగా ఈ సినిమా ఛాయాగ్రాహకుడు రవి కే. చంద్రన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఒక ఆన్ లొకేషన్ స్టిల్ పోస్ట్ చేసి "రికార్డ్ సమయంలో ఆదిత్య వర్మ షూటింగ్ 65% పూర్తయింది. డైరెక్టర్.. కాస్ట్ & క్రూ.. మా నిర్మాత ముకేష్ మెహతాకు కృతజ్ఞతలు." అంటూ ట్వీట్ చేశాడు.
ఈ సినిమా మార్చ్ లోనే సెట్స్ పైకి వెళ్ళింది. అప్పుడే 65% షూటింగ్ అయిపోయిందంటే జెట్ స్పీడ్ తో సినిమాను తెరకెక్కిస్తున్నట్టే. ధృవ్ సరసన బనిత సంధు హీరోయిన్ గా నటిస్తోంది. రాధాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. జూన్లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.