పవన్ కళ్యాణ్ చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న `హరి హర వీర మల్లు` షూటింగ్ వచ్చే నెలలో పునఃప్రారంభించనున్నారు. ప్రస్తుతం ఆయన 17వ శతాబ్దపు యోధుడి పాత్రకు సరిపోయేలా తన జుట్టును పెంచుతున్నాడు. చందమామ కథల్లో యోధుడిలా పవన్ కల్యాణ్ కనిపిస్తారని గుసగుస వినిపిస్తోంది. ఆంగ్లేయులను ఎదుర్కొనే వీరమల్లు రూపం విక్రమార్కుడినే తలపిస్తుందన్న గుసగుసా వైరల్ అవుతోంది.
ఈలోగా దర్శకుడు క్రిష్ పవన్ కళ్యాణ్ ని కలిసి స్క్రిప్ట్ లో తాను చేసిన మార్పులను వివరించాడు. సినిమా షూటింగ్ ఆగిపోయాక.. సుదీర్ఘ మహమ్మారి కాలాన్ని సద్వినియోగం చేసుకున్న క్రిష్ ..తన ఆస్థాన రచయితలతో కలిసి స్క్రిప్ట్ ను మంచి ఆకృతిలోకి తీసుకువచ్చారు.
షూటింగ్ ని మళ్లీ ప్రారంభించేందుకు భారీ సెట్లు కూడా వేస్తున్నారు. పీరియాడికల్ డ్రామాలో పవన్ కళ్యాణ్ రాబిన్ హుడ్ తరహా పాత్రను పోషిస్తున్నాడు. నిధి అగర్వాల్ అతని ప్రియురాలి పాత్రలో నటిస్తుండగా.. నర్గీస్ ఫక్రీ మరో కీలక పాత్రలో కనిపించనుంది. ప్రముఖ నిర్మాత AM రత్నం అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని పాన్ ఇండియా కేటగిరీలో నిర్మిస్తున్నారు. తెలుగు-తమిళం-హిందీలో పాన్-ఇండియన్ ప్రాజెక్ట్ గా ఇది విడుదల కానుంది. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.