స్టన్నింగ్ విజువల్స్ తో ఆద్యంతం ఆకట్టుకుంటోన్న 'విక్రాంత్ రోణ' ట్రైలర్..!

Update: 2022-06-23 14:01 GMT
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ''విక్రాంత్ రోణ''. అనూప్ భండారి దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా సినిమా ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. ప్రపంచ వ్యాప్తంగా జూలై 28న ఈ చిత్రాన్ని గ్రాండ్ గా థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ జోరుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఇప్పటికే 'విక్రాంత్ రోణ' నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ లభించింది. ఈ క్రమంలో తాజాగా ముంబైలో గ్రాండ్ గా నిర్వహించిన ఈవెంట్‌ లో ట్రైలర్ ను ఆవిష్కరించారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ట్విటర్ వేదిక ట్రైలర్ ను రిలీజ్ చేసి టీమ్ మొత్తానికి శుభాకాంక్షలు తెలిపారు.

స్టన్నింగ్ విజువల్స్ తో కూడిన ఈ ట్రైలర్‌ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ట్రైలర్‌ ను పరిశీలిస్తే.. 'ఆ ఊరే ఒక మర్మమైన ఊరు.. అక్కడి ప్రజలు ఏదో ఒక భయంకరమైన కథను దాచాలని అనుకుంటున్నారు.. కథని దాచగలరు.. కానీ భయాన్ని దాచలేరు.. ఆ కథ మళ్లీ మొదలైంది.. ఆ డెవిల్ మళ్లీ వచ్చాడు' అనే వాయిస్ ఓవర్ తో ప్రారంభమైంది.

'భయం నిండిన ఆ ఊరిలోకి భయమంటే తెలియని ఒకడు వచ్చాడు' అంటూ సుదీప్ ని పరిచయం చేసారు. శత్రువుల గుండెల్లో భయాన్ని కలిగించే లార్డ్ ఆఫ్ ది డార్క్ అని కూడా పిలువబడే విక్రాంత్ రోనాగా సుదీప్ కనిపించారు. అతను ఏదో మిస్టరీని చేధించడానికి ప్రయత్నిస్తున్నాడని తెలుస్తోంది.

ఫాంటసీ అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్ గా అత్యున్నత సాంకేతిక విలువలతో హై ప్రొడక్షన్ వాల్యూస్ తో ఈ సినిమాని రూపొందించారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ - నిరూప్ భండారి - నీతా అశోక్ ప్రధాన పాత్రల్లో కనిపించారు.

నిరూప్ భండారి - రవిశంకర్ గౌడ - మధుసూదన్ రావు - వాసుకి వైభవ్ ఇతర పాత్రలు పోషించారు.

విజువల్స్ చాలా గ్రాండియర్ గా ఉన్నాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. దక్షిణాది నుంచి మరో భారీ సినిమా రాబోతోందని ట్రైలర్ హింట్ ఇచ్చింది. ‘విక్రాంత్ రోనా’ 3డిలో కన్నడ, తమిళం, తెలుగు, మలయాళం, హిందీ మరియు ఇంగ్లీష్ వంటి ఆరు భాషల్లో విడుదల కానుంది.

జీ స్టూడియోస్ & కిచ్చా క్రియేషన్స్ సమర్పణలో షాలిని ఆర్ట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని రూపొందించారు. జాక్ మంజునాథ్ - షాలిని మంజునాథ్ నిర్మించిన ఈ సినిమాకి అలంకార్ పాండియన్ సహ నిర్మాతగా వ్యవహరించారు.  బి.అజనీశ్ లోక్ నాథ్ సంగీతం సమకూర్చగా.. విలియమ్ డేవిడ్ సినిమాటోగ్రఫీ అందించారు. 'కేజీయఫ్' ఫేమ్ శివకుమార్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించారు.

ఇటీవల కాలంలో అనేక సౌత్ సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటిన సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు ‘విక్రాంత్ రోనా’ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.


Full View
Tags:    

Similar News