సెల్ఫీ మూడ్ లో వినయ విధేయ కుటుంబం

Update: 2018-12-03 05:29 GMT
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'వినయ విధేయ రామ' సంక్రాంతికి రిలీజ్ కానుంది.  ఇక నెలరోజులు మాత్రమే ఉండడంతో ప్రమోషన్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి.  ఈరోజు(సోమవారం) సాయంత్రం 4 గంటలకు ఫస్ట్ సింగిల్ ను విడుదల చేస్తామని ఇప్పటికే 'వినయ విధేయ రామ' టీమ్ ప్రకటించింది.

తాజాగా ఈ విషయం తెలుపుతూ ఒక కొత్త పోస్టర్ విడుదల చేశారు. 'తందానె తందానె' అంటూ సాగే ఈ పాట ఫ్యామిలీ సాంగ్ అని తెలిపారు. ఇక పోస్టర్లో చరణ్ రీల్ ఫ్యామిలీ అందరూ ఉన్నారు. హీరోయిన్ కియారా అద్వాని సెల్ఫీ స్టిక్ తో టాప్ యాంగిల్ వ్యూ నుండి చరణ్ కుటుంబ సభ్యులందరికీ ఫోటో తీస్తుంటే అందరూ చిరునవ్వులు చిందిస్తున్నారు.  ఫోటోలో చరణ్  తో పాటు.. చలపతి రావు.. ప్రశాంత్.. ఆర్యన్ రాజేష్.. రవి వర్మ..  మధునందన్.. స్నేహ.. అనన్య. .హిమజ.. ఇలా ఫుల్ ఫ్యామిలీ ఉంది.

ఈ సినిమాకు రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.  చరణ్- దేవీ కాంబినేషన్ లో లాస్ట్ సినిమా 'రంగస్థలం' ఆడియో సూపర్ డూపర్ హిట్ కావడంతో ఈ సినిమాకు కూడా దేవీ రాకింగ్ ఆల్బం ఇస్తాడనే అంచనాలు ఉన్నాయి.  మరి కొద్ది గంటల్లో  'తందానే తందానే' తో మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది.  గెట్ రెడీ గైస్..!
Tags:    

Similar News