వినయ విధేయ రాముడి మూలకథ ఇదేనట!

Update: 2018-11-09 05:00 GMT
బోయపాటి శ్రీను సినిమా అంటేనే కమర్షియల్ మీటర్లో ఉంటుంది.  స్ట్రాంగ్ ఫ్యామిలీ ఎమోషన్స్.. తన చర్యలతో వెన్నులో వణుకు పుట్టించే విలన్.. ఆ విలన్ ను ఎదుర్కొనే సరైన హీరో.. ఇలా సాగుతుంది వరస.  ఇక యాక్షన్ సీక్వెన్స్ లు చూస్తే.. బోయపాటి సినిమాల్లో సెంటీమీటర్ కూడా కొత్తదనం ఉండదని విమర్శించే ఘనులకు కూడా గూస్ బంప్స్ వస్తాయి!  బోయపాటి తన తాజా చిత్రాన్ని ఈ విషయంలో ఇంకా పీక్స్ కి వెళతాడని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా?

ఎందుకంటే ఈ సినిమాలో అసలే 'రచ్చ' హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.  ఏదో కాస్త క్లాస్ ను బయటకు తెసేందుకు మూడు నాలుగు సినిమాల నుండి తెగ శ్రమపడ్డాడు గానీ అయనలో ఉండేదే మాసు.  ఇదంతా సరేగానీ అసలు ఈ సినిమా కథ ఎలా ఉంటుంది?  టైటిల్ చూస్తే సున్నితంగా వినయంగా విధేయంగా ఉంది. ఫస్ట్ లుక్ లో ఏమో మెగా గ్లాడియేటర్ లాగా కనిపించాడు..  ఏంటీ తికమక అని కొందరు నెటిజనులు అంటున్నారు.  ఈ సినిమా స్టొరీ లైన్ కు సంబంధించి ఫిలిం నగర్లో ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమా మూలకథ ఇద్దరు అన్నదమ్ముల చుట్టూ తిరుగుతుందట.  అన్నయ్య పాత్రలో తమిళ హీరో ప్రశాంత్ నటించాడట. ఇక తమ్ముడిగా చరణ్ కనిపిస్తాడు.  ఇద్దరి మధ్య తీసిన సీన్స్ చాలా బాగా వచ్చాయని ఆడియన్స్ ను మెప్పిస్తాయని అంటున్నారు. తన అన్నయ్య కోసం వినయంగా విధేయంగా ఉండే రామ్ చరణ్ అజర్ బైజాన్ వరకూ వెళ్లి ఫైట్లు చేస్తాడేమో. ఈరోజే టీజర్ రిలీజ్ ఉంది గానీ స్టొరీ విషయం హింట్ ఇచ్చే అవకాశం తక్కువే. 
Tags:    

Similar News