సంక్రాంతి సీజన్లో విడుదలైన సినిమాల్లో కమర్షియల్ గా భారీ విజయం సాధిస్తుందని అంచనాలు ఉన్న సినిమా రామ్ చరణ్ 'వినయ విధేయ రామ'. చరణ్ స్టార్ ఇమేజ్ కి తోడుగా 'రంగస్థలం' లాంటి బ్లాక్ బస్టర్ సాధించిన ఊపుమీద ఉండడం.. పైగా మాస్ పల్స్ తెలిసిన బోయపాటి శ్రీను దర్శకుడు కావడంతో క్రిటిక్స్ తమ గొంతు నొప్పి పుట్టేలా రొటీన్ సినిమా అని.. బాగాలేదని అరిచి గీపెట్టినా సినిమా భారీ కలెక్షన్స్ సాధించడం ఖాయమనే అంచనాలు ట్రేడ్ వర్గాల్లో వ్యక్తం అయ్యాయి.
క్రిటిక్స్ సంగతేమో గానీ బోయపాటి సాధారణ ప్రేక్షకులను మెప్పించడంలో కూడా విజయం సాధించలేదు. కానీ టాక్ తో సంబంధం లేకుండా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మొదటి రోజునే పాతిక కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఎంత నెగెటివ్ టాక్ ఉన్నప్పటికీ మాస్ సినిమా కావడం.. పండగ సీజన్ హాలిడేస్ కలిసిరావడంతో సినిమా తర్వాత నాలుగు రోజుల్లో మరో 20 కోట్లు సాధించింది. ఇప్పటివరకూ దాదాపుగా రూ. 50 కోట్ల షేర్ వసూలు చేసిన ఈ చిత్రం ఫుల్ రన్ లో రూ. 60 కోట్ల షేర్ మార్కును టచ్ చేసే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.
సినిమాను భారీ రేట్లకు అమ్మడంతో మొత్తం రికవరీ ఉండదు. డిజాస్టర్ అనేది ఖాయమే అయినా నష్టాలు ఎంత తగ్గితే అంత మంచిదే కదా. సినిమాకు బ్యాడ్ టాక్ వస్తేనే ఇంత వసూలు చేసిందంటే.. ఒకవేళ హిట్ టాక్ వచ్చి ఉంటే ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి ఉండేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఓవరాల్ గా చూస్తే సినిమా ఫ్లాప్ అయినా సంక్రాంతి సీజన్ ను ఫుల్ గా వాడుకున్నది 'వినయ విధేయ రామ' అనడంలో ఏమాత్రం సందేహం లేదు. బోయపాటి మాత్రం భలే భలే ఛాన్సును వేస్ట్ చేసినట్టే.
Full View