సినిమా పరిశ్రమలో చాలా కథలు ఒక హీరోని కాదనీ మరొక హీరో దగ్గరికి వెళ్లడం సాధారణమే. ఎన్నో. హిట్టు సినిమాలని మిస్ చేసుకున్న హీరోలు ఒకానొక సమయంలో ఆ సినిమా మిస్ చేసుకోవాల్సింది కాదు అని బాధపడుతుంటారు. స్టార్ హీరోలకు ఇది చాలా వరకు అలవాటే. కానీ డిజాస్టర్ కథలను రిజెక్ట్ చేస్తే మాత్రం కెరీర్ పై కొంచెం అవగాహన పెరుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. గతంలో అక్కినేని హీరో నాగ చైతన్య కూడా ఒక డిజాస్టర్ కథని మిస్ చేసుకున్నందుకు ఇప్పుడు హమ్మయ్య అనుకుంటున్నాడట.
ఆ కథ మరేదో కాదు. సాయి ధరమ్ తేజ్ వివి.వినాయక్ కాంబినేషన్ లో వచ్చిన ఇంటిలిజెంట్ సినిమానే. కథను రాసిన శివ ఆకుల 2014లో ఢమరుకం సినిమాకు దర్శకత్వం వహించిన శ్రీనివాస్ రెడ్డికి ఈ కథను వినిపించాడట. వెంటనే అతను ఒప్పుకొని చైతు తో తీయాలని ప్లాన్ చేశారడు. కానీ ఎందుకో గాని సినిమా పట్టాలెక్కలేదు. కొన్ని కారణాల వల్ల షూటింగ్ స్టార్ట్ కాకముందే ఎండ్ కార్డ్ పడింది. అయితే వివి వినాయక్ కి శివ ఆకులకు మంచి పరిచయం ఉండడంతో అతనికి చెప్పగా వినాయక్ సాయిని లైన్ లో పెట్టాడు.
అయితే సినిమా మొదలైనప్పుడు అంచనాలు బాగానే ఉన్నాయి. కానీ రాను రాను సినిమాలో బలం లేదని వార్తలు రావడం స్టార్ట్ అయ్యింది. ఇక ఫైనల్ గా శుక్రవారం రిలీజ్ అయిన సినిమా మొదటి షోకే డిజాస్టర్ గా నిలిచింది. అఖిల్ కంటే దారుణంగా వినాయక్ ఈ సినిమాని తెరకెక్కించాడు అనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. మొత్తంగా సినిమా థ్రియేటికల్ రైట్స్ రూ.27 కోట్లకు అమ్ముడు పోయాయి. వినాయక్ - సాయి కి మాస్ ఆడియెన్స్ సపోర్ట్ బాగానే ఉంటుంది. కానీ సినిమాలో మ్యాటర్ లేకపోవడంతో సినిమాకు రెండవ రోజు కలెక్షన్స్ అందడం కష్టమే అనే టాక్ వస్తోంది.