వైర‌ముత్తు సంచ‌ల‌న నిర్ణ‌యం

Update: 2021-05-30 04:08 GMT
లిరిసిస్ట్ గా వైరముత్తు ఘ‌న‌త ఏంట‌నేది అంద‌రికీ తెలిసిందే. భార‌త మూడో అత్యున్న‌త పుర‌స్కారం ప‌ద్మ‌భూష‌ణ్ మొద‌లు, ప‌ద్మ‌శ్రీ, కేంద్ర సాహిత్య అకాడ‌మీ, ఏడు జాతీయ అవార్డులు ఆయ‌న‌ను వ‌రించాయి. అలాంటి వైర‌ముత్తును గ‌డిచిన మూడేళ్లుగా లైంగిక ఆరోప‌ణ‌లు వెంటాడుతున్నాయి. ప్ర‌ముఖ గాయ‌ని చిన్మ‌యి మొద‌లు ప‌లువురు ఆయ‌న‌పై వేధింపుల ఆరోప‌ణ‌లు చేశారు. అయితే.. తాజాగా ఈ వివాదం మ‌రోసారి వార్త‌ల్లోకి వ‌చ్చింది.

దీని కార‌ణం వైరముత్తుకు కేర‌ళ ఓఎన్వీ అకాడ‌మీ అవార్డును ప్ర‌క‌టించ‌డ‌మే. ప్ర‌తిష్టాత్మ‌క‌ సాహిత్య పుర‌స్కారాన్ని వైర‌ముత్తుకు ఇవ్వ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించింది ఓఎన్వీ. దీంతో.. గ‌తంలో ఆరోప‌ణ‌లు చేసిన‌వారితోపాటు ప‌లువురు ర‌చ‌యిత‌లు జ్యూరీపై ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు. ఎంతో మంది నుంచి లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఆయ‌న‌కు ఈ అవార్డును ఎలా ప్ర‌క‌టిస్తార‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో ఓఎన్వీ అకాడ‌మీ క‌న్నా ముందుగానే వైర‌ముత్తు స్పందించారు. త‌న‌కు ప్ర‌క‌టించిన పుర‌స్కారాన్ని వెన‌క్కి ఇచ్చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. అవార్డుతోపాటు త‌న‌కు ప్ర‌క‌టించిన రూ.3 ల‌క్ష‌ల‌ను ముఖ్య‌మంత్రి స‌హాయ నిధికి అందిస్తున్న‌ట్టు చెప్పారు. త‌న వ్య‌క్తిగ‌త సొమ్ము 2 ల‌క్ష‌లు క‌లిపి మొత్తం రూ.5 ల‌క్ష‌లు సీఎం రిలీఫ్ ఫండ్ కు ఇచ్చేస్తున్న‌ట్టు తెలిపారు. కాగా.. విమ‌ర్శ‌ల నేప‌థ్యంతో ఓఎన్వీ కూడా అవార్డు నిర్ణ‌యాన్ని స‌మీక్షిస్తామ‌ని ప్ర‌క‌టించింది. ఈ లోగానే వైర‌ముత్తు పై విధంగా ప్ర‌క‌ట‌న చేశారు.
Tags:    

Similar News