కోలీవుడ్ బ్రదర్స్ సూర్య, కార్తి తమిళ ఇండస్ట్రీతో పాటు తెలుగు ఇండస్ట్రీలోనూ మంచి మార్కెట్ ని క్రియేట్ చేసుకున్నారు. సూర్యకు `గజిని` టర్నింగ్ పాయింట్ గా నిలిస్తే కార్తికి తెలుగులో `ఆవారా`తో మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నారు.
అప్పటి నుంచి ఈ కోలీవుడ్ బ్రదర్స్ తమ ప్రతి సినిమాని క్రమం తప్పకుండా తెలుగులో రిలీజ్ చేస్తూ ఇక్కడ కూడా సత్తా చాటుతున్నారు. మధ్యలో కొన్ని సినిమాలు నిరాశ పరిచినా ఖాకీ, ఖైదీ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ లుగా నిలవడంతో మళ్లీ కార్తి ట్రాక్ లోకి వచ్చేశాడు.
అదే ఊపులో గత ఏడాది `సుల్తాన్`తో మరో హిట్ ని తమిళ, తెలుగు భాషల్లో సొంతం చేసుకోవాలని కార్తి చేసిన ప్రయత్నం ఆశించిన స్థాయిలో ఫలించలేదు. దీంతో కొంత విరామం తీసుకున్న కార్తి `విరుమన్` సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీకున్న విశేషం ఏంటంటే ఈ మూవీ ద్వారా దిగ్రేట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శంకర్ ముద్దుల కూతురు అదితి శంకర్ హీరోయిన్ గా పరిచయం అవుతోంది.
ముత్తయ్య డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని 2డీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై హీరో సూర్య, జ్యోతిక సంయుక్తంగా నిర్మించారు. తమిళంలో భారీ అంచనాలు నెలకొన్న ఈ మూవీని ఆగస్టు 12న విడుదల చేయబోతున్నామంటూ హీరో కార్తి ప్రకటించి షాకిచ్చాడు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమాని ముందు ఆగస్టు 31న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. రిలీజ్ డేట్ ని కన్ఫమ్ చేస్తూ పోస్టర్లని కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
అయితే సడన్ గా రిలీజ్ డేట్‌ని ఆగస్టు 31 నుంచి 12కు మార్చడం పలువురిని షాక్ కు గురిచేస్తోంది. సడన్ గా రిలీజ్ డేట్ మార్చడానికి కారణం విక్రమ్, విశాల్ అని తెలుస్తోంది. ఆగస్టులో విక్రమ్ నటించిన `కోబ్రా`ని ఆగస్టు 11న రిలీజ్ చేస్తున్నామంటూ ప్రకటించారు. కానీ ఇప్పడు ఆ డేట్ న రావడం లేదట. అంతే కాకుండా విశాల్ నటిస్తున్న `లాఠీ` కూడా పక్కకు తప్పుకోవడంతో ఇదే రైట్ టైమ్ అని భావించిన `విరుమన్` టీమ్ సడన్ గా రిలీజ్ డేట్ ని ఆగస్టు 12కు మార్చినట్టుగా చెబుతున్నారు.
రిలీజ్ కు మరీ పట్టుమని పది రోజులు కూడా లేకపోవడంతో ఎలా ప్రమోట్ చేస్తారు? .. సినిమా ఎంత వరకు రీచ్ అవుతుంది?.. తొందర పేరుతో సాఫీగా రావాల్సిన సినిమాని తొందరపాటుతో కిల్ చేయరు కదా! అనే కామెంట్ లు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ఇదే టైమ్ లో `కార్తికేయ 2`, లాల్ సింగ్ చద్దా వచ్చేస్తున్నాయి. వీటి నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకుని కార్తి `విరుమన్` ఎంత వరకు నిలబడుతుందని హడావిడి రిలీజ్ తో కోలీవుడ్ బ్రదర్స్ సూర్య, కార్తి ఇబ్బందుల్ని కొని తెచ్చుకుంటారా అంటూ కోలీవుడ్ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.